Hansika Motwani: మరోసారి తెరపైకి గోవా బ్యూటీ హార్మోన్ ఇంజక్షన్ వ్యవహారం

గోవా బ్యూటీ హన్సిక మోత్వాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పదహారణాల తెలుగు అందం ఉట్టిపడేలా తెలుగు ప్రేక్షకులను మొదటి సినిమాతోనే బాగా ఆకర్షించిన ముద్దుగుమ్మలలో హన్సిక మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు చిత్రంలో వైశాలి పాత్రలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ.. మొదటి సినిమాతోనే యువత మతులు పోగొట్టింది.

నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హన్సిక. చిన్న వయసులోనే టెలివిజన్, బాలీవుడ్ పరిశ్రమలలో పనిచేయడం ప్రారంభించింది. కాస్త పెద్దయ్యాక నేరుగా తెలుగు ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. 2003 వ సంవత్సరంలో హృతిక్ రోషన్‌తో “కోయి మిల్ గయా” అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన హన్సిక.. 2007లో అల్లు అర్జున్ తో దేశముదురు చిత్రంలో గ్లామర్ కిక్కిచ్చింది.

అయితే ఈ నాలుగేళ్లలోనే ఆమె అందాలలో ఇంత మార్పు రావడానికి కారణం హార్మోన్ ఇంజక్షన్ తీసుకోవడమేనని అప్పట్లో ఆరోపణలు కూడా ఉన్నాయి. హన్సిక పెద్దగా కనిపించడం కోసం ఆమె తల్లి ఇంజక్షన్ చేయించిందని అప్పట్లో ఈ పుకార్లు ఇండస్ట్రీలో బాగా వినిపించాయి. అయితే ఆ పుకార్లపై ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న హన్సిక తాజాగా రియాక్ట్ అయింది.

- Advertisement -

తనపై వచ్చిన ఆరోపణలు చాలా బాధపెట్టాయని చెప్పింది. ఒకవేళ తాను గనుక హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకొని ఉంటే ఇప్పటికీ తీసుకోవాలి కదా..? పైగా మా అమ్మే ఈ ఇంజక్షన్స్ ఇప్పించిందని పుకార్లు రావడం చాలా బాధపెట్టిందని చెప్పుకొచ్చింది హన్సిక. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు డబ్బులు తీసుకుని ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారని.. ఇలాంటి వార్తలలో నిజం లేదని చెప్పుకొచ్చింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు