Varun Tej: మెగా హీరోలకు తెలుగు రచయితలపై నమ్మకం లేదా – కథలు దొరకట్లేదా..?

మెగా ఫ్యామిలిలో ప్రస్తుతం రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో మొదలైన రీమేక్ ల పరంపర ఆ తర్వాత కాటమరాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇలా వరుసగా రీమేక్స్ చేస్తూ వచ్చాడు. అంతే కాకుండా ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తమిళ సినిమా ‘తేరి’ ఆధారంగా రూపొందిస్తుండగా, సాయిధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని డైరెక్షన్లో ‘వినోదాయ సీతాం’ కి రీమేక్ గా మరో సినిమాలో నటించాడు. మరో పక్క మెగాస్టార్ కూడా రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 ని తమిళ సినిమా కత్తి కి రీమేక్ గా రూపొందించారు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ ను మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్ గా రూపొందించారు. అంతే కాకుండా ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా కూడా తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిస్తున్నారు.

మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా రీమేక్ సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్లో సూపర్ హిట్ గా నిలిచిన భూల్ భులాయా 2 సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. తమిళ సినిమా రాట్చసన్ కి రీమేక్ గా రాక్షసుడు సినిమా తీసి హిట్ అందుకున్న రమేష్ వర్మ ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే రాక్షసుడు సీక్వెల్ తర్వాత వరుణ్ తేజ్ తో భూల్ భులాయా2 రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. వరుణ్ తేజ్ గత చిత్రాలు గని, ఎఫ్3 ఆశించిన స్థాయిలో అలరించకపోవటంతో గ్యాప్ తీసుకొని ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రీమేక్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మెగా హీరోలకు తెలుగు దొరకట్లేదా?, తెలుగు రచయితలపై నమ్మకం లేదా అన్న కామెంట్స్ వస్తున్నాయి.  రీమేక్ సినిమాలకు సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉండటం మెగా అభిమానులను కలవరపెడుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ తెచ్చిన ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రీమేక్ చేస్తున్నాడు అన్న వార్త రావటంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇంకా ఈ ప్రపోజల్ వరుణ్ తేజ్ వద్దకు వెళ్లలేదని, వరుణ్ తేజ్ ని సంప్రదించగా అతని నిర్ణయాన్ని బట్టి కథపై కసరత్తు మొదలు పెట్టాలని రమేష్ వర్మ ఆలోచిస్తున్నాడట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు