Sankranthi season: ఈ సంక్రాంతికి అల్లుడు రావట్లేదు… మొగుడు రావట్లేదు

సంక్రాంతి సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి వస్తుంది అంటేనే అరడజన్ సినిమాలు లైన్ లో ఉంటాయి. ఎందుకంటే మామూలు రోజుల్లో కంటే కూడా సంక్రాంతి సీజన్ లో ఒక సినిమాను రిలీజ్ చేస్తే ఆ సినిమాకి వచ్చే మార్కెట్ వేరే లెవెల్ లో ఉంటుందని చాలా మంది నిర్మాతలకు క్లారిటీ ఉంది. వీరందరికంటే ఎక్కువ క్లారిటీ దిల్ రాజుకి ఉంటుంది. అందుకే సంక్రాంతి అంటే కచ్చితంగా దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉంటుంది.

ఇప్పటివరకు సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకుని ప్రయత్నం చేశారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని ముందుగానే ఫిక్స్ అయ్యారు దిల్ రాజు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ను పూర్తి చేసుకోలేదు. ఎంత త్వరగా చేసినా కూడా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ క్లారిటీ దిల్ రాజు తో పాటు చాలా మందికి వచ్చేసింది.

ఇక అఫీషియల్ గా దిల్ రాజ్ ఈ సినిమాని మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే దిల్ రాజు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో గుంటూరు కారం, సైంధవ్ సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసే పనిలో పడనున్నారు. అయితే ప్రతిసారి సంక్రాంతికి తన సినిమాలను ప్లాన్ చేసుకునే దిల్ రాజు ఈ సంక్రాంతికి తన సినిమా రిలీజ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ గా చూస్తే శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా అని చెప్పొచ్చు.

- Advertisement -

గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి కానుక రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా కూడా కేవలం 80% మాత్రమే షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శంకర్ భారతీయుడు సినిమా పనిలో పడిపోయారు. అందుకని ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయలేమని క్లారిటీతో ఫ్యామిలీ స్టార్ తో ట్రై చేశారు. కానీ ఆ సినిమా కూడా సంక్రాంతికి అందించలేమని క్లారిటీ వచ్చింది. ఇక దిల్ రాజు సినిమా భాషలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి అల్లుడు రావట్లేదు మొగుడు రావట్లేదని చెప్పొచ్చు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు