Ravanasura: సుధీర్ వర్మ వల్లే రావణాసుర కు “A ” సర్టిఫికెట్ వచ్చిందా..?

మాస్ మహారాజ రవితేజ సుధీర్ వర్మ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమాకు సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది, మాములుగా ఎంటర్టైనింగ్ ఉండే రవితేజ సినిమాల్లో కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది తప్ప, హింసకు స్కోప్ ఉండదు. ట్రైలర్ చుస్తే హింస కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ, బోల్డ్ కంటెంట్ అయితే కనిపించట్లేదు. మరి A సర్టిఫికెట్ ఇచ్చేంతగా ఈ సినిమాలో ఏముంది అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సుధీర్ వర్మ, రవితేజ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

సెన్సార్ నుండి A సర్టిఫికెట్ రావటానికి కారణం చెప్పుకొచ్చిన సుధీర్ వర్మ తాను పట్టు పట్టడం వల్లే ఈ సినిమాకు A సర్టిఫికెట్ వచ్చిందని అన్నారు. బెంగాలీ సినిమా కథ ఆధారంగా తీసిన ఈ సినిమాను తనకు ఇష్టమైన హాలీవుడ్ డైరెక్టర్ టోరంటినో సినిమాల ఇన్స్పిరేషన్ తో తెరకెక్కించానని.  ఆయన సినిమాల్లో కంటెంట్ ‘రా’ గా ఉంటుందని, బూతులు కూడా ఎక్కువగానే ఉంటాయని అన్నారు. రావణాసుర కథ కూడా ఆ స్టైల్లో చెప్తే మాత్రమే బాగుంటుందని అన్నారు. సినిమా సెన్సార్ కు వెళ్ళినప్పుడు చాలా కట్స్ చెప్పారని, ఆ కట్స్ అన్నిటికి ఓకే చెప్తే సినిమాకున్న ఫీల్ పోతుందని అనిపించి కట్స్ నో చెప్పానని అందుకే A సర్టిఫికెట్ వచ్చిందని చెప్పుకొచ్చారు.

థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల పట్ల ఇంత కచ్చితంగా ఉన్న సెన్సార్ చట్టం, ఓటీటీల్లో అడ్డు అదుపు లేకుండా బూతులు నింపి రిలీజ్ చేస్తున్న సినిమాలను కూడా సెన్సార్ పరిధిలోకి ఎందుకు తీసుకోవట్లేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలో ఇంటిల్లిపాది కలిసి చూడచ్చు అన్న పేరున్న రవితేజ సినిమాకు A సర్టిఫికెట్ రావటం ఏ రకంగా ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఏప్రిల్ 7వరకు ఆగాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు