Tollywood: సన్నబడ్డ వరలక్ష్మి – హీరోయిన్ ఆఫర్ల కోసమేనా..?

వరలక్ష్మి శరత్ కుమార్.. తెలుగులో పవర్ఫుల్ లేడి క్యారెక్టర్స్ తో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నటి. క్రాక్, వీర సింహారెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో మెప్పించి తన సత్తా చాటింది. వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ సమయంలో తనకు వరుస పెట్టి లేడీ విలన్ రోల్ ఆఫర్స్ వస్తున్నాయని, తనకేమో హీరోయిన్ గా కూడా చేయాలనీ ఉందని చెప్పుకొచ్చారు. తాను కొంచెం బొద్దుగా ఉండటం వల్లే హీరోయిన్ ఆఫర్స్ రావట్లేదేమో అని అభిప్రాయ పడ్డారు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో మెరిసిన వరలక్ష్మి మునుపటికంటే కాస్త సన్నబడి అందరిని షాక్ కి గురి చేసింది.

వరలక్ష్మి రీసెంట్ ఫోటోలు చూస్తుంటే ఈ కోలీవుడ్ భామ హీరోయిన్ ఆఫర్స్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్టు ఉందని అనిపిస్తుంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో లేడి విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టైములో వరలక్ష్మి ఇలా హీరోయిన్ అవకాశాల కోసం సన్నబడటం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా గతంతో పోలిస్తే వరలక్ష్మి సన్నబడ్డాక అంత అట్రాక్టివ్ గా కనిపించటం లేదు అన్నది నెటిజెన్స్ నుండి వస్తున్న అభిప్రాయం. అయితే వరలక్ష్మి హీరోయిన్ ఆఫర్ల కోసమే సన్నబడిందా లేక వేరే కారణం ఏదైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

గతంలో కూడా బొద్దుగుమ్మలు నమిత, హన్సిక వంటివారు ఆఫర్ల కోసం డైటింగ్ చేసి సన్నబడ్డారు, అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. అప్పట్లో జీరో సైజ్ కు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు పెర్ఫామెన్స్ ఉండాలి కానీ, జీరో సైజ్ తో పని లేదని నిత్యామీనన్, నివేద థామస్ వంటి వారు ప్రూవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఆఫర్ల కోసమే సన్నబడింది అన్నదాంట్లో ఏ మేరకు నిజం ఉందో తెలియాలంటే  వరలక్ష్మి నుండి క్లారిటీ రావాల్సిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు