Liger : కోకా 2.0 అప్డేట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రాబోతుంది. ఈ నెల 25న థియేటర్ లలోకి రానుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ్ కి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుంది. అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ మూవీ టీం ప్రమోషన్స్ పనులను వేగంగా జరుపుకుంటుంది. దేశ వ్యాప్తంగా ప్రమోషనల్ టూర్ వేస్తున్నారు. దీనికి మంచి స్పందన కూడా వస్తుంది.

కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే ట్రైలర్ తో పాటు అక్డీ పక్డీ, అఫట్ వంటి పాటలు యూట్యూబ్ లో విడుదల అయ్యాయి. తాజాగా మూడో పాట విడుదలకు మూవీ టీం సర్వం సిద్దం చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కోకా 2.0 అనే సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను నిర్మాత ఛార్మీ కౌర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ తలపాగా, పైజామాతో కనిపిస్తున్నాడు. అలాగే రెండ్ కలర్ రెహాంగాతో అనన్య పాండే ఉంది. డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్ అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఛార్మీ.

ఇప్పటికే వచ్చిన రెండు పాటలు, ఒక ట్రైలర్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ రోజు వచ్చే కోకా 2.0 సాంగ్ కూడా మెప్పించేలా ఉంది. దీంతో ఈ నెల 25న విడుదల కాబోయే లైగర్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు