Cobra Trailer : అపరిచితుడుకు మించి..

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తాజాగా నటిస్తున్న చిత్రం కోబ్రా. డిమోట్ కాలనీ, అంజలీ సీబీఐ వంటి చిత్రాలను తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. విక్రమ్ కు జోడీగా కేజీఎఫ్ ఫేం శ్రీ నిధి శెట్టి నటిస్తుంది. అలాగే ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ తమిళ వర్షన్ గురువారం విడుదల కాగా, తెలుగు వర్షణ్ శుక్రవారం వచ్చింది.

విభిన్న గెటప్స్ తో ప్రేక్షకులను మెప్పించే విక్రమ్, ఈ చిత్రంలో కూడా డిఫరెంట్ పాత్రలలో కనిపించినట్టు తెలుస్తుంది. నువ్వేనా కోబ్రా.. అంటూ ఒక పోలీస్ అధికారి విక్రమ్ ను కొడుతున్న సమయంలో.. విక్రమ్ వెటకారంగా నవ్వుతాడు. అప్పుడు ట్రైలర్ ప్రారంభమవుతుంది. ”అత‌డే కోబ్రా.. ర‌క‌ర‌కాలుగా రూపం మార్చుకొని వెళ్ల‌డం తెలుసు.. చాటుగా మాటేసి కాటేయ‌డ‌మూ తెలుసు” అనే వాయిస్ ఓవ‌ర్‌తో ఈ చిత్రంలో విక్రమ పాత్ర ఏంటో తెలుస్తుంది.

విక్ర‌మ్ డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో క‌నిపించి సినీ లవర్స్ కావాల్సిన కావాల్సిన థ్రిల్‌ను అందించినట్లు తెలుస్తుంది. అలాగే ఏఆర్ రెహ‌మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అలాగే ఈ చిత్రంలో విక్రమ్ ను పట్టుకునే ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌ కనిపిస్తున్నాడు. ఇర్ఫాన్ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. కాగా ఇర్ఫాన్ పఠాన్ వెండి తెరపై కనిపించడం ఇదే తొలిసారి అనే సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఈ నెల 31న తెలుగు, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. విడుదలకు ముందు వచ్చిన ఈ ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను పెంచుతుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు