Ravi Teja : మళ్లీ కొత్త స్ట్రాటజీనే..

తెర పైన వినోదం పండించడంలో హీరో రవితేజ ది ట్రేడ్ మార్క్. తనదైన డైలాగ్ డెలివరీ, హావభావాలతో అలవోకగా హాస్యాన్ని పండిస్తారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలోనూ.. వేగంగా సినిమాలు చేయడంలోనూ దిట్ట అనిపించుకున్నారు రవితేజ. వరుసగా సినిమాలు సైన్ చేస్తున్న ఈ మాస్ మహారాజ్ ఇప్పటికే చేతిలో ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలను లైన్లో పెట్టాడు. ధమాకా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లే.. అలాగే రావణాసుర మరికొద్ది రోజుల్లో పూర్తి అవుతుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా లైన్లో ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ.

నిఖిల్ ” సూర్య వర్సెస్ సూర్య” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సినీ ఫోటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఎక్స్ ప్రెస్ రాజా, ప్రేమమ్, నిన్ను కోరి, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్ ఇప్పుడు మళ్లీ డైరెక్షన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ధమాకా సినిమాను నిర్మిస్తున్న పీపుల్స్ మీడియానే ఈ సినిమాను కూడా నిర్మిస్తుంది. ఈ మూవీ విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఈ మూవీ స్టైలిష్ థ్రిల్లర్ అని టాక్. ఈ మూవీకి ” ఈగిల్” అని పేరు పెట్టినట్లు సమాచారం. వరుస డిజాస్టర్ లతో ఉన్న రవితేజకు ఈ సినిమా ఎంతవరకు హిట్ ఇస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు