Cobra : నట విశ్వరూపం

కోలీవుడ్ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్ గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరైన పాత్ర దొరికితే తనలోని నట విశ్వరూపం చూపించేస్తారు ఈ వెర్సటైల్ యాక్టర్. ఈ స్టార్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ప్రమోషన్స్ పోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను చాలా తేలికగా చేస్తున్నాడు’ అనే డైలాగ్ ఆసక్తిగా ఉంది. ఈ డైలాగ్ తో కోబ్రా సినిమాలో విక్రమ్ లెక్కాల మాస్టర్ అని తెలుస్తుంది. ఆ లెక్కాలతోనే శత్రువులను వేటాడుతాడని అర్థమవుతుంది. ఇందులో చియాన్ విభిన్న లుక్ లలో కనిపిస్తున్నాడు.

ఇక ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పలు కీలక సన్నివేశాల్లో కనిపించాడు. ఇక టీజర్ చూస్తుంటే లెక్కల మాస్టర్ గా కోబ్రా అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ అని అర్థమవుతుంది. 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కె.ఎస్.రవికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో సందడి చేయడం ఈ మూవీకి హైప్ ను పెంచనుంది. కాగా ఈ చిత్రం ఆగస్టు 31న థియేటర్‌లోకి రాబోతోంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు