Captain Miller : ధనుష్ సినిమా కూడా కాపీనే… “కెప్టెన్ మిల్లర్” రచ్చ స్టార్ట్

Captain Miller : కోలీవుడ్ స్టార్ ధనుష్ లేటెస్ట్ మూవీ “కెప్టెన్ మిల్లర్” తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను ఒక నవల నుంచి కాపీ కొట్టారంటూ నటుడు, రైటర్ కం డైరెక్టర్ వేల రామమూర్తి ఆరోపించడం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినిమా రిలీజ్ అయిన పది రోజుల తర్వాత “కెప్టెన్ మిల్లర్” రచ్చ స్టార్ట్ అయ్యింది.

అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందిన తాజా యాక్షన్ థ్రిల్లర్ “కెప్టెన్ మిల్లర్”. ఈ సినిమాలో ధనుష్ కు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా కోలీవుడ్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అయితే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్ పరంగా నెమ్మదిగా నడుస్తోంది. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాకముందే కాపీ వివాదంలో చిక్కుకుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కోలీవుడ్ సీనియర్ నటుడు వేల రామమూర్తి “కెప్టెన్ మిల్లర్” సినిమాను కాపీ కొట్టారు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను రచించిన పట్టత్తు యానయ్ అనే నవల ఆధారంగా కెప్టెన్ మిల్లర్ సినిమాను తెరకెక్కించారని రామమూర్తి ఆరోపించడం సంచలనంగా మారింది.

తన అనుమతి లేకుండానే తన నవలను కాపీ కొట్టారని ఇంటర్వ్యూ ద్వారా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన వేల రామమూర్తి త్వరలో ఈ విషయం గురించి తాను డైరెక్టర్ యూనియన్ లో ఫిర్యాదు చేయబోతున్నట్టు వెల్లడించారు. తనకు ఈ విషయంలో న్యాయం కావాలని, డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ భారతి రాజా తనకు సాయం చేస్తారనే నమ్మకంతోనే తాను సినిమా డైరెక్టర్స్ యూనియన్ ను ఆశ్రయించబోతున్నట్టు ప్రకటించారు. ఇక పనిలో పనిగా తాను డబ్బు కోసమో, ఫేమ్ కోసమో “కెప్టెన్ మిల్లర్” టీంపై ఇలాంటి నిందలు వేయట్లేదని ముందుగానే క్లారిటీ ఇచ్చారు వేల రామమూర్తి. తనకు డబ్బు, ఫేమ్ ఇప్పటికే ఉన్నాయని, తనకిప్పుడు న్యాయం మాత్రం కావాలని చెప్పుకొచ్చాడు. అయితే వేల రామమూర్తి చేస్తున్న ఈ కాపీ కామెంట్స్ పై “కెప్టెన్ మిల్లర్” టీం ఇంకా స్పందించలేదు.

- Advertisement -

ఇక ఈ వివాదం సంగతి పక్కన పెడితే “కెప్టెన్ మిల్లర్” సినిమా తెలుగు వెర్షన్ ను జనవరి 26న రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని ముందుగా ధనుష్ టీం భావించింది. కానీ సంక్రాంతికి టాలీవుడ్ లో నలుగురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడం, థియేటర్లు దొరకకపోవడం వంటి సమస్యలతో వాయిదా వేసుకున్నారు. ఇక ప్రస్తుతం “కెప్టెన్ మిల్లర్” తమిళ వర్షన్ కు మిక్స్డ్ టాక్ రావడంతో, మరి ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు