Ooru Peru Bhairavakona : ఇలా జరిగితే సందీప్ కిషన్ బయ్యర్లకు ఇక దేవుడే!

Ooru Peru Bhairavakona

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పైనే బయ్యర్లంతా ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి నుంచి ఇప్పటిదాకా విడుదలైన సినిమాలతో భారీగా నష్టాలను చవి చూసిన తమను ఈ హీరో అయినా గట్టెక్కిస్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే ఇక సందీప్ బయ్యర్లకు దేవుడే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన”. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. దైవభక్తి, క్షుద్ర శక్తి, కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 16న రాబోతోంది. అయితే సందీప్ కిషన్ తో పాటు బయ్యర్లు కూడా ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి సంక్రాంతి అనేది టాలీవుడ్ కు అతిపెద్ద సినిమా సీజన్. కానీ ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా అద్భుతాలు ఏమి జరగలేదు. 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నాలుగు పెద్ద సినిమాల్లో కేవలం హనుమాన్ మాత్రమే భారీ కలెక్షన్స్ రాబట్టింది. నాగార్జున “నా సామిరంగా” మూవీ కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది. కానీ మిగతా రెండు సినిమాలు మాత్రం బయ్యర్లకు నష్టాలను మిగిల్చాయి.

ముందుగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” గురించి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ రివ్యూస్, నెగిటివ్ టాక్ తో యావరేజ్ మూవీగా నిలిచింది. కొన్నిచోట్ల ఈ మూవీని కొన్న బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఇక ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన “సైంధవ్” సంక్రాంతి సీజన్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అప్పటినుంచి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. దాదాపు నెల గడిచిపోతున్నా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే సినిమా రానేలేదు. గేమ్ ఆన్, యాత్ర 2, బూట్ కట్ బాలరాజు, కిస్మత్ వంటి చిన్న, పెద్ద చిత్రాలు రిలీజ్ అయినప్పటికీ అట్టర్ ప్లాప్ గా నిలిచాయి.

- Advertisement -

అలాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ట్రూ లవర్ సినిమాలకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన “ఈగల్” ఎగిరినట్టుగానే ఎగిరి, అడ్డం పడింది. రవితేజ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. కెప్టెన్ మిల్లర్, లాల్ సలాం వంటి డబ్బింగ్ సినిమాలది కూడా ఇదే పరిస్థితి. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు “ఊరు పేరు భైరవకోన” మూవీపైనే ఉన్నాయి. సందీప్ కిషన్ మూవీ అయినా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ బ్యాడ్ ఫేజ్ కు ముగింపు పలుకుతుందని బయ్యర్లు ఆశిస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు