Bhola Shankar : బడ్జెట్ పెరుగుతుందా ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో భోళా శంకర్ కూడా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అనిల్ సుంకర, కే.ఎస్.రామారావు లు కలిసి నిర్మిస్తున్నారు. నిజానికి మెహర్ రమేష్ 7 ఏళ్ళ వరకు ఖాళీగా ఉంటూ వచ్చాడు. మెహర్ రమేష్ కు సినిమా అవకాశం ఇవ్వడానికి చిన్న హీరోలు కూడా చాలా సార్లు ఆలోచించారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం ముందుకొచ్చి అవకాశం ఇచ్చారు. వేదాలం అనే తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం చేసే ముందు చిరు మెహర్ కు ఓ కండిషన్ కూడా పెట్టారు.

సినిమాను అనుకున్న బడ్జెట్ లో కంప్లీట్ చేయాలి అనేది ఆ కండిషన్ లల్లో ఒకటి. 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం, సెకండ్ షెడ్యూల్ జూన్ 21 నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రానికి మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఇప్పుడు ఎక్కువ అవుతుంది అనేది ఇన్సైడ్ టాక్. కానీ ఆ తప్పు మెహర్ ది కాదు. షూటింగ్ మధ్యలో చిరు కొంత భాగాన్ని రీ షూట్ చేయమని కోరారట. అందుకే భాళా శంకర్ సినిమాకు బడ్జెట్ పెరుగుతుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు