RRR : లెజండరీ గేమ్ డిజైనర్ ప్రశంస

ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయి వేరు , స్థానం వేరు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచ సినిమానే మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ విజువల్ వండర్ ట్రిపుల్ ఆర్ సినిమా ఎల్లలు దాటి ప్రయాణిస్తుంది. అరుదైన రికార్డ్స్ ను కైవసం చేసుకుంటుంది. ఎన్నో ఏళ్ళ నిరీక్షణకు అసలైన ఫలితం ఇప్పుడు లభిస్తుంది.

మన సినిమా గొప్పతనం మన చెప్పుకోవడం వేరు, ఇతర దేశాల వాళ్ళు ఒప్పుకోవడం వేరు. ట్రిపుల్ ఆర్ సినిమాకి నలుమూలలు నుంచి ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం విదితమే. ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాకి మరో విశేష స్పందన లభించింది. ది లెజండరీ వీడియో గేమ్ డిజైనర్ “హిడియో కోజిమా” ట్రిపుల్ ఆర్ సినిమా చూసి ట్విట్టర్ వేదికగా సినిమా గురించి జపనీస్ భాషలో రాసుకొచ్చారు.

సోషల్ మీడియా లో ట్రిపుల్ ఆర్ సినిమా గురించి “హిడియో కోజిమా” వినడం, సినిమా చూసి నిడివి ఎక్కువగా ఉన్న కూడా ఈ సినిమాని చూడండి అని ట్రిపుల్ ఆర్ సినిమాని ఉద్దేశించి చెప్పడం. గర్వించదగ్గ విషయమే. హిడియో కోజిమా ఒక జపనీస్ వీడియో గేమ్ డిజైనర్, దర్శకుడు, నిర్మాత మరియు రచయిత.అతను తన బాల్యం దశనుండి యాక్షన్/అడ్వెంచర్ సినిమా మరియు సాహిత్యంపై అభిరుచిని పెంచుకున్నాడు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు