Hema : మొన్న బిర్యానీ.. నిన్న ఆవకాయ.. రేపు సాంబారా? ఎంత కవరింగ్ చేసిన లాభం లేదు..

Hema : టాలీవుడ్ నటి హేమ రీసెంట్ గా బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల కింద తెలుగు, కన్నడ ఇండస్ట్రీ లలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ న్యూస్ అంతకంతకు ముదురుతోంది. టాలీవుడ్ సెలెబ్రటీస్ లో కొంతమంది పేర్లు వైరల్ కాగా, ప్రత్యక్షంగా అయితే నటి హేమను అరెస్ట్ చేసినప్పటి నుంచి, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసులో తన పేరు ఉండకుండా చేయడానికి హేమ చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా మొత్తంగా నటి హేమ మాత్రం అక్కడికి వెళ్లినట్టు ప్రూవ్ అయింది. అయితే నటి హేమ (Hema) ఈ కేసులో పడకుండా, తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదు అన్నట్టు క్రియేట్ చేయ్యడానికి చాలా ట్రై చేస్తూ, అందులో భాగంగా వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోలు కూడా బెంగుళూరు లోనే తీసినవని, హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్పిందని పోలీసులు కంఫర్మ్ చేసారు. ముఖ్యంగా పోలీసులు షేర్ చేసిన ఫోటోలో, హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఒకే డ్రేస్ ఉండటంతో హేమ బాగోతం మొత్తం బయట పడింది.

Actress Hema Making Avakay Video Viral

మొన్న బిర్యానీ.. నిన్న ఆవకాయ.. రేపు సాంబారా?

అయితే నటి హేమ ఈ కేసు నుండి తప్పించుకోవడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తుంది. అప్పటికప్పుడు వీడియో తీసి తప్పించుకుందామని అనుకున్నా, ఒకే రేవ్ పార్టీ డ్రెస్ లోనే వీడియో తీయడంతో దొరికిపోయింది. ఇక ఆ తర్వాత ఇంటికొచ్చి వంటల వీడియోలు తీస్తూ టాపిక్ డైవర్ట్ చేద్దామని చూస్తుంది. ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు బిర్యానీ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ కదా ఆవకాయ పెడుతున్నానంటూ మరో వీడియో పోస్ట్ చేసింది. ఇక్కడే అసలు విషయం దాగుంది. సమ్మర్ ఆల్రెడీ ముగింపుకు వచ్చేసింది. అవకాయకి పెట్టే మామిడికాయలు ఇప్పుడు రావు. అప్పటికప్పుడు చేసే మామూలు కాయలు ఓ మోస్తరు గా దొరుకుతాయి. అలాంటిది సమ్మర్ మొత్తంలో చేయనిది రేవ్ పార్టీ తర్వాతే పెట్టాల్సి వచ్చిందా అని ట్రోల్ చేస్తున్నారు. ఇక హేమ వీడియో చూసిన నెటిజన్లు మొన్న బిర్యానీ, నేడు ఆవకాయ, రేపు సాంబార్ చేస్తావా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఎంత కవరింగ్ చేసినా ఏమి లాభం లేదని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

హేమ కి మా ప్రెసిడెంట్ మద్దతు..

ఇదిలా ఉండగా రీసెంట్ గా మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ మంచు విష్ణు నటి హేమకు మద్దతు గా స్టేట్ మెంట్ చేసాడు. ట్విట్టర్ లో ఈ విషయాన్నీ తెలియచేస్తూ, జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి శ్రీమతి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిర్ధారణ కానీ, ఇంకా కన్ఫర్మ్ చేయని వార్తని వైరల్ చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. నటి హేమ (Hema) దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించబడాలని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని, శ్రీమతి హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే, MAA తగిన చర్యలు తీసుకుంటుందని, అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వైరల్ చేయకండని పోస్ట్ చేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు