Hema Drugs case : హేమకు అండగా నిలిచిన మా అధ్యక్షుడు… ఆమె ఇమేజ్ ని దెబ్బ తీయొద్దు అంటూ స్టెంట్ మెంట్.

Hema Drugs case : టాలీవుడ్ నటి హేమ రీసెంట్ గా బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల కింద తెలుగు, కన్నడ ఇండస్ట్రీ లలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ న్యూస్ అంతకంతకు ముదురుతోంది. టాలీవుడ్ సెలెబ్రటీస్ లో కొంతమంది పేర్లు వైరల్ కాగా, ప్రత్యక్షంగా అయితే నటి హేమను అరెస్ట్ చేసినప్పటి నుంచి, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసులో తన పేరు ఉండకుండా చేయడానికి హేమ చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఇక బెంగళూరు రేవ్ పార్టీ అంటూ వార్తలు వచ్చినపుడు హేమ పేరు బాగా వినిపించగా, తర్వాత హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు వచ్చినా, అవి ఫేక్ అని తెలిపోయింది. కానీ హేమ మాత్రం అక్కడికి వెళ్లినట్టు ప్రూవ్ అయింది. అయితే నటి హేమ (Hema Drugs case) ఈ కేసులో పడకుండా, తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదు అన్నట్టు క్రియేట్ చేయ్యడానికి చాలా ట్రై చేస్తూ, అందులో భాగంగా వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆ వీడియోలు కూడా బెంగుళూరు లోనే తీసినవి అని హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్పిందని పోలీసులు కంఫర్మ్ చేసారు. ముఖ్యంగా పోలీసులు షేర్ చేసిన ఫోటోలో, హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఒకే డ్రేస్ ఉండటంతో హేమ బాగోతం మొత్తం బయట పడింది.

MAA president Manchu Vishnu supports actress Hema in drugs case

కరాటే కళ్యాణి ఘాటు కామెంట్స్..

ఇదిలా ఉండగా నటి కరాటే కళ్యాణి ఓ ఇంటర్వ్యూ లో హేమ పై విరుచుకుపడింది. హేమ ఒక ఫేక్ అని, ప్రతి ఒక్కరి మీద బురద జల్లుతూ ఉంటుందని, ఈరోజు మాత్రం తన మీద బురద జల్లుకుందని హేమ పార్టీలో, అక్కడ డ్రగ్స్ తో కూడా దొరికింది. రేవ్ పార్టీ అంటేనే ఒక వరస్ట్ గ్యాంగ్ తో చేసుకునే పార్టీ అది. ఆమెది పబ్ కల్చర్ అని, తప్పుడు చేసింది, దొరికింది అంతే.. అని వ్యాఖ్యానించింది. అలాగే ఇంట్లో వాళ్లకి ఫోన్ చేస్తానని చెప్పి.. పోలీసులు దగ్గరే ఫోన్ తీసుకొని..హౌస్ లో ఉన్నట్టు సెల్ఫీ వీడియో చేసిందని, ఓవరాల్ గా హేమ అటు పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాలని ట్రై చేసిందని, కానీ దొరికిపోయింది.. మొత్తం మీద హేమ, వల్ల ఇండస్ట్రీ పరువు మొత్తం పోతోందంటూ ఘాటుగా కామెంట్లు చేశారు కరాటే కళ్యాణి. అలాగే ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో మాట్లాడతానని వ్యాఖ్యానించింది.

- Advertisement -

హేమ కి మా ప్రెసిడెంట్ మద్దతు.. స్టేట్మెంట్ విడుదల..

ఇక తాజాగా మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ మంచి విష్ణు నటి హేమకు మద్దతు గా స్టేట్ మెంట్ చేయడం సంచలనం రేపుతోంది. లేటెస్ట్ గా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ లో ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్ లో ఏముందంటే… ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి శ్రీమతి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిర్ధారణ కానీ, ఇంకా కన్ఫర్మ్ చేయని వార్తని వైరల్ చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. నటి హేమ (Hema Drugs case) దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి మరియు భార్య, మరియు పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్‌ను దూషించడం అన్యాయమని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని, శ్రీమతి హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే, MAA తగిన చర్యలు తీసుకుంటుందని, అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వైరల్ చేయకండని పోస్ట్ చేసాడు.

ఇక తాజాగా మంచు విష్ణు స్టేట్మెంట్ తో ఇండస్ట్రీ లో మిశ్రమ స్పందన వినిపిస్తుంది. కాని సోషల్ మీడియాలో మాత్రం నెగిటివిటి మరీ ఎక్కువయింది. ఆ మధ్య కరాటే కళ్యాణి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పిర్యాదు చేస్తానని వెల్లడించినా, ఆమె అక్కడికి వెళ్లి ఉండదు అని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో ఓ చోట ఎన్టీఆర్ విగ్రహం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం నుండి తొలగించారు. ఏది ఏమైనా నటి హేమ రేవ్ పార్టీ కేసు మరిన్ని మలుపులు తీసుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు