Samantha: రెండో పెళ్లి… సమంతకు స్ట్రాంగ్ వార్నింగ్ ?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత నటనకి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సింగిల్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ ను చూపిస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం తాను వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక సమంత….అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వీరు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరికి వారుగా ఉంటున్నారు.

విడాకుల అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సినిమాలలో నటించింది. ప్రస్తుతం సమంత పూర్తిగా కోలుకొని సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం సమంత ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఎక్కువగా పెడుతోంది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత విడాకులు తీసుకుని దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తోంది.

- Advertisement -

ఈ క్రమంలోనే సమంత కుటుంబసభ్యులు సమంతను మళ్ళీ వివాహం చేసుకోవాలని తెగ ఇబ్బంది పెడుతున్నారట. ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు…. నీకంటూ ఒక తోడు ఉండాలి కదా అని సమంత తల్లిదండ్రులు బాధపడుతున్నారట. ఈ విషయంలో సమంత కాస్త ఇబ్బంది పడుతుందని తెలుస్తోంది. తన తల్లిదండ్రుల కోరిక మేరకు మళ్ళీ వివాహం చేసుకుంటుందా? లేకపోతే వివాహం చేసుకోకుండా అలానే ఉండిపోతుందా… అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన సమంత, నాగచైతన్య అభిమానులు వీరిద్దరు మళ్ళీ కలుసుకోవాలి. ఇంకో వివాహం చేసుకోకూడదు అని కామెంట్లు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు