Vishwak Sen: రేపు క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేయండి, అనిల్ రావిపూడి కి కౌంటర్ వేశాడా.?

Vishwak Sen: వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్సేన్. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఈ సినిమాలో వివేక్ అనే పాత్రలో కనిపించాడు విశ్వక్. ఈ సినిమా తర్వాత తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను కూడా బయటకు తీసి ఫలక్నామా దాస్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయింది.

ముక్కుసూటిగా మాట్లాడుతాడు

విశ్వక్సేన్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. విశ్వక్ వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఏదన్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదైనా చెప్పాలి అనిపిస్తే చెప్పేస్తాడు. రీసెంట్ గా చాలా వివాదాలు కు కేంద్ర బిందువు అయ్యాడు విశ్వక్సేన్. ప్రస్తుతం విశ్వక్సేన నటిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. ఛల్ మోహన్ రంగ సినిమా తర్వాత కృష్ణచైతన్య చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Vishwak Sen: Enjoy the cricket match tomorrow, did Anil counter Ravipudi?
Vishwak Sen: Enjoy the cricket match tomorrow, did Anil counter Ravipudi?

అనిల్ రావిపూడి కి కౌంటర్ వేసాడా

ఇక ఈ సినిమాలో విశ్వక్ తన డ్రీమ్ రోల్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ లో మాట్లాడుతూ “ముందు ట్రైలర్ ఎంజాయ్ చేయండి. తర్వాత రేపు ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. దానిని ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కృష్ణమ్మ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అనిల్ రావిపూడి క్రికెట్ మ్యాచ్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు అన్నదానికి ఇది కౌంటర్ లా ఉంది అని కొంతమంది అనుకుంటున్నారు. విశ్వక్ మైండ్ లో ఇది లేకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం ఇదే ఫీల్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు