Love me: సీక్వెల్ షురూ.. టైటిల్ అదుర్స్.!

Love me:బేబీ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు లవ్ మీ: ఇఫ్ యూ డేర్ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆశిష్ హీరోగా నటించగా శిరీష సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకం పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ సినిమాను నిర్మించారు.. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అరుణ్ భీమవరపు దర్శకుడిగా వ్యవహరించారు. దెయ్యంతో ప్రేమ కథ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకులలో సినిమాపై క్యూరియాసిటీని పెంచేసి..సినిమాని మాత్రం పెద్దగా తెరకెక్కించలేదని వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనే విషయానికి వస్తే.. కథలో విషయం ఉంది.. కానీ కథనంలో కాస్త గందరగోళం కూడా ఉంది.. అంటే హీరో హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ నుంచి సన్నివేశాల వరకు చాలా డీటెయిల్ గా చేశారు.. హీరో బ్లాక్ డ్రెస్ ఎందుకు వేస్తున్నారు? చెప్పులు లేకుండా ఎందుకు తిరుగుతున్నాడు? అనే ప్రశ్నల నుంచి మొదలు పెడితే ట్విస్ట్ ల వరకు ఎక్స్ప్లనేషన్ అంతా రాసుకున్నారు.. కానీ ఆయన డీటెయిల్ రిజిస్టర్ కావడం కష్టం.. ప్రేక్షకులకు ట్విస్టులు ఎక్కువ ఇవ్వాలని స్టార్టింగ్ నుంచి ప్రశ్న మీద ప్రశ్నలు వదులుతూ వెళ్లారు.. దాంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి సినిమా చూసిన తర్వాత ఏం జరుగుతోంది అనే సందేహం కలుగుతుంది.. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత దెయ్యం ఎవరు? అనే విషయంలో మలుపులు తిప్పుతూ.. ఎక్కువ కన్ఫ్యూజ్ చేశారు.. ఎండింగ్ అయితే బాగానే వచ్చింది.. ఇక ఇద్దరూ కూడా నటన పరంగా ప్రేక్షకులను మెప్పించారు కానీ కాస్త గందరగోళంతో ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

‘లవ్ మీ ‘ కి సీక్వెల్..

Love me: Sequel Shuru.. Title Adurs..
Love me: Sequel Shuru.. Title Adurs..

అసలే సినిమాతో కన్ఫ్యూజన్ లో పడ్డాము అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ అంటే అందరూ ఆలోచనలో పడ్డారు.. నిజంగానే ఈ సినిమా సీక్వెల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాలకు “కిల్ మీ : ఇఫ్ యు లవ్ ” అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.. ఇటీవలే సీక్వెల్ ని కూడా ప్రకటించారు.. మరి ఈ సీక్వెల్ ప్రేక్షకుల కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.. ఏది ఏమైనా వైష్ణవి చైతన్య మరో సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోందని చెప్పవచ్చు.

- Advertisement -

వైష్ణవి చైతన్య కెరియర్:

ప్రముఖ యూట్యూబర్ గా కెరియర్ మొదలు పెట్టిన వైష్ణవి చైతన్య.. సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే షార్ట్ ఫిల్మ్ తో వెలుగు వెలిగింది. ఆ తరువాత బేబీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ..తెలుగు అమ్మాయికి ఈ రేంజ్ లో గుర్తింపు లభించడం అంటే నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు లవ్ మీ అంటూ మరొకసారి ప్రేక్షకులు ముందుగా వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు