Krish Jagarlamudi: అనుష్క తో భారీ ప్లాన్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ దర్శకుడు

Krish Jagarlamudi: గమ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు క్రిష్ జాగర్లమూడి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. గమ్యం సినిమా చాలామందికి ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా ఈ సినిమాను చేశాడు క్రిష్. ఈ సినిమా తర్వాత క్రిష్ చేసిన సినిమా వేదం. వేదం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కూడా ఇప్పటికీ చాలామందికి ఈ సినిమా అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది.

Miss Shetty Mr Polishetty

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి కంబ్యాక్

ఈ సినిమాలో అనుష్క వేశ్యపాత్రలో కనిపించింది. ఇకపోతే ఒకప్పుడు ఉన్న టాప్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. అందరు స్టార్ హీరోలుతో జతకట్టింది అనుష్క. అయితే రీసెంట్ టైమ్స్ అనుష్క సినిమాలు తగ్గిస్తుంది అని వార్తలు వస్తున్న తరుణంలో, నవీన్ పోలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది.

క్రిష్ దర్శకత్వంలో

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ‘ఘాటీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు .వ్యాపార రంగంలో అంచలంచలుగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు స్వార్థంతో కావాలని ఎలా నష్టపరిచారు? ఆమె నేరస్థురాలిగా ఎందుకు మారింది? ఆ తర్వాత ఆమె వారిపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అనేదే ఈ సినిమా కథాంశం అని తెలుస్తోంది. ఇది ఒక బిగ్ ఫిలిం అని తెలిపారు క్రిష్ జాగర్లమూడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు