Bollywood Heroine:రోడ్డున పడుతారు… భర్తను ఉద్దేశించి హీరోయిన్ పోస్ట్..!

Bollywood Heroine.. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో, అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఆమె విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలకు బలం చేకూరేలా ఇప్పుడు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు బయటపడుతున్నాయి.. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ 2020లో వివాహం చేసుకున్నారు.. నటాషా ఐపీఎల్ ప్రతి సీజన్లో కూడా కనిపించింది. అయితే ఈ సారీ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా పాండ్యా అరంగేట్రం చేసినప్పటి నుంచి నటాషా కనిపించలేదు.. అంతేకాదు ఆమె ఏ మ్యాచ్ చూడడానికి రాలేదు.. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే వార్తలకు బలం చేకూరింది.

హర్దిక్ , నటాషా మధ్య విడాకులు..

Bollywood Heroine: Falling on the road... Heroine's post addressing her husband..!
Bollywood Heroine: Falling on the road… Heroine’s post addressing her husband..!

పైగా ఈ వార్తలకు మరింత బలం చేకూరే విధంగా మార్చి 4వ తేదీన నటాషా పుట్టినరోజు నాడు హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్టు కూడా చేయలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు మొదలయ్యాయి.. ఇక రోజు రోజుకి ఈ వార్తలు మరింత వ్యాపించాయి.. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు మొదలయ్యాయి.. పైగా ఈ పుకార్లకు బలం చేకూర్చుతూ నటాషా స్టాంకోవిచ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా అనే ఇంటి పేరును కూడా తొలగించింది.. పైగా ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా కి సంబంధించిన ఒక ఫోటోని కూడా ఆమె షేర్ చేయలేదు.. ఇలా ఈ కొన్ని పరిణామాల వల్ల వీరిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం మొదలైంది..

రోడ్డున పడబోతున్నారంటూ నటాషా క్యాప్షన్..

దీనికి తోడు తాజాగా నటాషా తన ఇన్స్టా లో చేసిన పోస్ట్ మరింత కలకలం సృష్టిస్తోంది.. ఒకరు వీధిన పడబోతున్నారు అనే క్యాప్షన్ తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫోటో షేర్ చేసింది.. ఇది హార్దిక్ పాండ్యాను ఉద్దేశించిందే అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి..

- Advertisement -

విడాకులపై అందుకే హార్దిక్ స్పందించలేదు..

Bollywood Heroine: Falling on the road... Heroine's post addressing her husband..!
Bollywood Heroine: Falling on the road… Heroine’s post addressing her husband..!

పైగా ఇటీవల బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు విడాకుల విషయంలో హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% నటాషాకు ఇవ్వవలసి ఉంటుందట.. ఎందుకంటే హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ సెర్బియా దేశానికి చెందినవారు.. అందువల్ల ఆమె సెర్బియన్ దినార్లలో భరణం పొందే అవకాశం కూడా ఉంటుంది.. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా ఎక్కడా కూడా తన తదుపరి ఆలోచనలపై మాట్లాడటం లేదని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు నాచురల్ జోడిగా కనిపించిన హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ మధ్య అంతా బాగుందని అనుకునే లోపే.. ఇలాంటి వార్తలు రావడం అభిమానులను కలవర పాటుకు గురిచేస్తోంది.. మరి ఈ వార్తలకు ఈ జంట కలిసి చెక్ పెడతారో లేక నిజంగానే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారో తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా వీరిద్దరూ మళ్ళీ కలిసి ఇలాంటి రూమర్స్ కి చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు