Gangs Of Godavari Trailer: విశ్వక్సేన్ అరాచకం, కృష్ణ చైతన్య స్ట్రాంగ్ కం బ్యాక్

Gangs Of Godavari Trailer: కృష్ణ చైతన్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సాహిత్య రచయితగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే చాలామంది దర్శకులు కావాలి అనుకునే వాళ్ళు ముందు ఇండస్ట్రీలోకి దూరి ఏదో ఒక పని చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత వాళ్లకి ఇష్టమైన కలను సాకారం చేసుకుంటారు. ఇలాంటి వాళ్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. రచయితగా మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, రచయితగా మొదలుపెట్టిన కొరటాల శివ, కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టిన వేణు, అలానే సాహిత్య రచయితగా అడుగు పెట్టిన కృష్ణ చైతన్య, కొరియోగ్రాఫర్ గా అడుగుపెట్టిన ప్రభుదేవా, ఇలా చాలామంది ఏదో ఒక పని చేసి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకులుగా కూడా తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.

రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా

నారా రోహిత్ హీరోగా నటించిన రౌడీ ఫెలో అనే సినిమాతో దర్శకుడుగా మారాడు కృష్ణ చైతన్య. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్టును సాధించింది. కృష్ణ చైతన్యలో ఇటువంటి డైరెక్టర్ ఉన్నాడని చాలామంది ఆశ్చర్యానికి గురయ్యాలా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ “నా భూతో నా భవిష్యత్తు” ప్రతి పాత్రకి డైలాగ్ తో ఎలివేషన్ ఇచ్చాడు కృష్ణ చైతన్య. ఈ సినిమాలో రావు రమేష్, నారా రోహితులు ఒకరిని మించి ఒకరు నటించారు అని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత చల్ మోహనరంగా అనే సినిమాకి దర్శకత్వం వహించాడు కృష్ణ చైతన్య. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించలేదు. రౌడీ ఫెలో లాంటి సినిమా తీసిన ఒక దర్శకుడు ఇలాంటి సినిమా తీశాడా అని చాలామంది ట్రాల్ కూడా చేశారు.

Gangs of Godavari

- Advertisement -

మాస్ కంబ్యాక్

ఇక ప్రస్తుతం కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 31 వ తారీఖున రిలీజ్ గానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. లంకల రత్న అనే పాత్రలో కనిపిస్తున్నాడు విశ్వక్సేన్. మాస్ యాసలో చెప్పాలంటే అరాచకానికి అర్థం చూపించాడు ఈ ట్రైలర్తో అని చెప్పొచ్చు. చాలా పవర్ ఫుల్ గా విశ్వక్సేన్ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు. అలానే ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకునేలా ఉంది. ఇది ఒక కంప్లీట్ యాక్షన్ ఫిలిం అని ట్రైలర్ చూడగానే అర్థమవుతుంది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్ అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ దర్శకుడిగా బీభత్సమైన కం బ్యాక్ కృష్ణ చైతన్య ఇచ్చినట్లు అర్థమవుతుంది.

డ్రీమ్ రోల్ కంప్లీట్

ఇకపోతే ప్రతి యాక్టర్ కి ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది అలా విశ్వక్సేన్ డ్రీమ్ రోల్ ఈ సినిమాతో నెరవేరబోతుంది అని ఇదివరకే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఇక ట్రైలర్ చూస్తుంటే అది నిజమని అనిపిస్తుంది. ఈ సినిమాలో రత్న వాళ్ళ అనే పాత్రలో అంజలి కనిపిస్తుంది. అంజలి పాత్ర కూడా చాలా బోల్డ్ గా డిజైన్ చేశాడు కృష్ణ చైతన్య. స్వతహాగా ఎన్టీఆర్ కి విశ్వక్సేన్ ఎంత పెద్ద అభిమానం మనకు తెలిసిందే. అందుకోసమే ఈ సినిమాలో కూడా టైగర్ అని రెండుసార్లు అనిపించాడు. ఇకపోతే సినిమాలో లాస్ట్ డైలాగ్ మనుషులు మూడు రకాలు ఆడాళ్ళు, మగాళ్ళు రాజకీయ నాయకులు అనే డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు