Netflix : లాస్ట్ ఇయర్ సెకండాఫ్ లో నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువగా చూసిన మూవీ ఏంటో తెలుసా? అస్సలు ఊహించలేరు

Netflix : ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ యుగంలో కంటెంట్ బాగుండె సినిమాలకు మంచి గుర్తింపు దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా ఓటీటీలో మాత్రం ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది ఇప్పటిదాకా నెట్ ఫ్లిక్స్ లో భారీ వ్యూస్ తో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న సినిమాల లిస్ట్ ను రివీల్ చేసింది ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్. ఇక ఇందులో మొదటి స్థానం దక్కించుకున్న సినిమా ఏంటో మూవీ లవర్స్ అస్సలు ఊహించలేరు.

నెట్ ఫ్లిక్స్ ఎంగేజ్మెంట్ రిపోర్ట్

ఓటీటీ దిగ్గజాలలో నెట్‌ఫ్లిక్స్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది సబ్ స్క్రయిబర్లు ఉన్నారు ఈ ఓటీటీకి. ఈ ఓటీటీలో ఇప్పటిదాకా ప్రసారమైన షోల వీక్షకుల సంఖ్యను తాజాగా విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు దాని రెండవ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్‌ను What We Watched : A Netflix Engagement Report పేరుతో విడుదల చేసింది. జూలై నుండి డిసెంబర్ 2023 వరకు నెట్ ఫ్లిక్స్  వ్యూయర్‌ షిప్‌ కు సంబంధించిన డేటా ఇందులో ఉంటుంది. అందులో నెట్ ఫ్లిక్స్ లో వ్యూస్ డేటాను 99 శాతం కవర్ చేశారు.

కొత్త సీజన్‌లతో మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతున్న కథనాలు ఇప్పటికీ మరింతగా నెట్ ఫ్లిక్స్ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 2023 ద్వితీయార్ధంలో నెట్ ఫ్లిక్స్ లో 100M వ్యూస్ వచ్చాయి. కొకో మిలన్ ఎనిమిది సీజన్‌లలో దాదాపు 200M వ్యూస్ వచ్చాయి. 2023 ద్వితీయార్ధంలో ప్రజలు 90 బిలియన్ గంటలు నెట్ ఫ్లిక్స్ ని వీక్షించారు. ఈ ఎంగేజ్మెంట్ నివేదిక ప్రకారం నెట్ ఫ్లిక్స్ లోని భారతీయ కంటెంట్ 2023 ద్వితీయార్ధంలో మొత్తం 1 బిలియన్ వీక్షణలను సంపాదించింది. నెట్ ఫ్లిక్స్ లో మొత్త 400 సిరీస్ లు ఉండగా, ఇందులో 11 భారతీయ సినిమాలు, సిరీస్ లు లీడింగ్ రేసులో స్థానం దక్కించుకున్నాయి. వాటిలో ఏడు సినిమాలు, నాలుగు షోలు ఉండడం విశేషం.

- Advertisement -

Jaane Jaan Movie Review: Give Jaideep Ahlawat Every Acting Award Out There  (& Indian Remake Of Joaquin Phoenix's Joker), Kareena Kapoor Khan  Surrenders To The Brilliance Of Sujoy Ghosh

నెంబర్ 1 ప్లేస్ లో కరీనా క్రైమ్ థ్రిల్లర్

నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన చిత్రం సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన జానే జాన్. ఇందులో కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. సెకండాఫ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూసిన చిత్రాల జాబితాలో ఈ చిత్రం 20.2 మిలియన్ల వ్యూస్ తో 83వ స్థానంలో నిలిచింది.

జవాన్ ను బీట్ చేసిన జానే జాన్

ఆ తర్వాత షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ కి 16.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనికి అట్లీ దర్శకత్వం వహించారు. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం 2023లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ జాబితాలో ఖుఫియా (12.1 మిలియన్లు), OMG 2 (11.5 మిలియన్లు), లస్ట్ స్టోరీస్ 2 (9.2 మిలియన్లు), డ్రీమ్ గర్ల్ 2 (8.2 మిలియన్లు), కర్రీ & సైనైడ్ (8.2 మిలియన్లు) కూడా ఉన్నాయి.

ఈ లిస్ట్ లో టాప్ వెబ్ సిరీస్ ఇదే

వెబ్ సిరీస్ విషయానికొస్తే YRF తొలి ఓటీటీ సిరీస్ ది రైల్వే మెన్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన ఇండియన్ సిరీస్‌లో అగ్ర స్థానంలో నిలిచింది. దీనికి శివ్ రావైల్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి 10.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత కోహ్రా, రాజ్ ఆడ డీకే గన్స్ అండ్ గులాబ్స్ ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు