OTT Movie : వృద్ధ జంట ముందే ఆ సినిమాలు తీసే గ్యాంగ్… ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా?

OTT Movie : ఇటీవల కాలంలో ఓటీటీలో క్రైమ్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వృద్ధ జంట ముందు బోల్డ్ సినిమాలు తీస్తే ఏం జరిగింది ? అనే ఓ ఇంట్రెస్టింగ్ సినిమానే ఈరోజు మన ఓటిటి మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంలోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

ఓటిటిలో ఎన్నో క్రైమ్ హారర్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ఎక్స్. ఈ మూవీ 2022 మార్చ్ 18న అమెరికాలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీకి టీ వెస్ట్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇక IMDB లో ఈ మూవీకి 10కి 6.5 రేటింగ్ దక్కింది. (దాదాపు 8.22 కోట్ల బడ్జెట్) సుమారు వన్ మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ మూవీ 1.51 యుఎస్ డాలర్లను రాబట్టింది అంటేనే ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీ ఏంటి అనే విషయంలోకి వెళ్తే…

ఎక్స్ మూవీ స్టోరీ…

ఎవరికైనా సరే బాగా డబ్బు సంపాదించాలి, ఫేమస్ అవ్వాలని కోరిక ఉంటుంది. అందరిలాగే ఓ ముగ్గురు అమ్మాయిలు, మరో ముగ్గురు అబ్బాయిలు కలిసి పో*ర్న్ సినిమాలు తీసి బాగా ఫేమస్ అవ్వాలని కలలు కంటారు. ఈ సినిమాలతో విపరీతంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంటారు. దీనికోసం ప్రత్యేకంగా సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో రెంట్ కి దిగుతారు. అయితే ఆ ఇంట్లో భయంకరంగా కనిపించే ఓ వృద్ధ జంట కాపురం ఉంటుంది. ఇక అద్దెకు దిగడంతోనే వచ్చిన పని స్టార్ట్ చేస్తారు. ఆలస్యం చేయకుండా పో*ర్న్ సినిమాల షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

- Advertisement -

X (2022): Every Kill, Ranked By Gruesomeness

అయితే ఇక్క ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంటి ఓనర్ భార్య అయిన పండు ముసలావిడకు ఆ కోరికలు బాగా ఎక్కువ. కానీ గుండె సమస్య ఉండడంతో ఆమె భర్త లైంగిక చర్యకు ఒప్పుకోడు. అలాంటి సమయంలోనే వచ్చి పడుతుంది ఈ యువ జంట పోర్న్ సినిమాల కోసం. ఇలా వీళ్ళు బో*ల్డ్ సినిమాలను షూట్ చేయడం ఆ ముసలావిడ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని మూవీని చూసే తెలుసుకోవాలి.

నిజానికి ఇప్పటిదాకా ఇంట్లో వరుసగా మనుషుల్ని చంపడం అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ దీంట్లో కొత్తదనం ఏమిటంటే ఓ ముసలావిడ వరుసగా అందరిని చంపడం, ఆమెకు దారుణమైన లైంగిక కోరికలు ఉండడం, ఆ వయసులో కూడా ఆమె సైకోలా ప్రవర్తించడం అనేది కొత్త కాన్సెప్ట్. మరి ఇప్పటిదాకా ఈ మూవీ ని చూడకపోతే కచ్చితంగా ఓ లుక్కెయ్యండి కానీ ఫ్యామిలీతో మాత్రం కాదు. ఎందుకంటే ఎక్స్ మూవీలో పేరుకు తగ్గట్టే హాట్ సీన్స్, రక్తపాతం ఎక్కువగా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు