Emanuel: స్టేజ్ పైనే గుక్క పెట్టి ఏడ్చిన జబర్దస్త్ కమెడియన్.. కారణం..?

Emanuel.. జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ లో ఇమ్మానుయేల్ కూడా ఒకరు. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా జబర్దస్త్ వదిలేసి వివిధ మార్గాలు ఎంచుకుంటూ ఉంటే.. ఈయన మాత్రం ఇక్కడే తన సత్తా చాటుతూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు.. ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు ఇమ్మానుయేల్. అదిరిపోయే పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనదైన శైలిలో అలరిస్తున్న ఈయన వర్ష తో లవ్ ట్రాక్ మొదలుపెట్టిన తర్వాత ఈయన దశ పూర్తిగా తిరిగిపోయింది.. తెలుగులో దాదాపు ప్రతి ఇంటికి బాగా పరిచయం అయిపోయాడు.. ఇప్పుడు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఇప్పటికే పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించిన ఇమ్మానుయేల్ మొదటిసారి విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న గం గం గణేశా సినిమాలో పూర్తిస్థాయి హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఇమ్మానుయేల్ తన జీవితంలో ఎదురైన విషాద సంఘటనల గురించి కూడా షేర్ చేసుకుంటూ తాను కంటతడి పెట్టడమే కాదు అందరి చేత కంటతడి పెట్టిస్తున్నాడు.

తాత చివరి చూపుకు నోచుకోలేదు..

Emanuel: Jabardast comedian who broke down and cried on the stage.. the reason..?
Emanuel: Jabardast comedian who broke down and cried on the stage.. the reason..?

ఇక అసలు విషయంలోకి వెళ్తే జబర్దస్త్ లోకి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే మంచి పేరు వస్తోందని.. అయితే ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో తన తండ్రి ఫోన్ చేసి తాత చనిపోయాడనే విషయాన్ని చెప్పాడట.. నిజానికి ఇమ్మానుయేల్ కు తన తాత అంటే చాలా ఇష్టమట.. కానీ అప్పుడు వెళ్తే ప్రోగ్రాం కి డిస్టర్బ్ అవుతుందని భావించి ..వెళ్లలేక కాసేపు పక్కకు వెళ్లి గుక్క పెట్టి ఏడ్చాడట. ఇక తర్వాత మళ్ళీ స్కిట్ పూర్తి చేస్తే ఆ స్కిట్ అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చారు.. ఇప్పటికి తాను చేసిన బెస్ట్ స్కిట్స్ లో అది కూడా ఒకటిగా ఉంటుందని తెలిపారు ఇమ్మానుయేల్ .. ఇకపోతే స్కిట్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తే అప్పటికే తాత అంత్యక్రియలు పూర్తయ్యాయని.. తన తాత చివరి చూపుకి కూడా తాను నోచుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయ్యాడు ఇమ్మానుయేల్.

అవకాశాలతో బిజీ..

ఇక అలాంటివన్నీ దాటుకొని వచ్చాను కాబట్టే ఈరోజు ఎంతో కొంత స్థానం లభించింది అని ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం అటు జబర్దస్త్ ఇటు సినిమాలు అంటూ భారీగా అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయారు. ఏది ఏమైనా ఇమ్మానుయేల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

గం గం గణేశా..

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మే 31వ తేదీన రిలీజ్ కాబోతోంది.. ఈ సినిమాలో ఇమ్మానుయెల్ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఫుల్ లెన్త్ పాత్ర పోషిస్తున్నారు.. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు.. అందులో భాగంగానే ఇప్పుడు పబ్లిక్ లో కూడా ప్రమోషన్స్ చేపట్టారు చిత్ర బృందం .. మరి ఏ మేరకు ఈ సినిమా వీరికి విజయాన్ని అందిస్తుందో చూడాలి.. మొత్తానికైతే ఇమ్మానుయేల్ కూడా ఇందులో తన టాలెంట్ ను మొత్తం నిరూపించుకున్నారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు