Varun Tej: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి స్టార్ హీరోస్.. ఇప్పుడైనా వర్కౌట్ అవుతుందా..?

Varun Tej.. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ ఒక కమర్షియల్ హిట్ కోసం దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గతంలో ముకుంద, గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఆ తర్వాత నటించిన ఆపరేషన్ వాలంటైన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించ లేకపోయాడు.. ఇక ఇప్పుడు మట్కా అంటూ మరొక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు వరుణ్ తేజ్.. ఈ క్రమంలోనే ఏకంగా ఈయన కోసం స్టార్ హీరోలు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వరుణ్ తేజ్ కోసం రామ్ చరణ్..

Varun Tej: Star heroes in the field for Varun Tej.. Will there be a workout now..?
Varun Tej: Star heroes in the field for Varun Tej.. Will there be a workout now..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. అందులో నలుగురు స్టార్ హీరోలే కావడం విశేషం.. ఈ క్రమంలోనే వాళ్ళు చేస్తున్న చాలా సినిమాలు కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధిస్తున్నాయి. అయితే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ ఈయనకు సక్సెస్ లు మాత్రం వెనుకబడిపోతున్నాయని చెప్పాలి.. డిఫరెంట్ కాన్సెప్ట్లను ఎంచుకుంటూ సినిమాలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు అయినా సరే ఆ సినిమాలేవి కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోగా.. ఆయనకు బ్యాడ్ నేమ్ కూడా తీసుకొస్తున్నాయి.. ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో కరుణ కుమార్ డైరెక్షన్లో మట్కా అనే సినిమా చేస్తున్నాడు.. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక అతిధి పాత్రలో నటించబోతున్నట్లు ఇప్పుడు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కూడా..

అంతేకాదు ఫైనల్ టచ్ గా ఎండింగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం.. మొత్తానికి అయితే అటు రామ్ చరణ్ తమ్ముడు కోసం ఇటు పవన్ కళ్యాణ్ కొడుకు కోసం వరుణ్ తేజ్ కి సక్సెస్ ను కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాతో వరుణ్ తేజ్ కు అనుకున్న సక్సెస్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఒక భారీ సక్సెస్ కొడితే అది మెగా ఫ్యామిలీ సక్సెస్ గా భావిస్తారు.. కాబట్టి వరుణ్ తేజ్ ఎలాగైనా సరే స్టార్ హీరోగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ లు వరుణ్ తేజ్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఇదే నిజమైతే కథ కథనం ప్రేక్షకులను మెప్పించగలిగితే వరుణ్ తేజ్ కూడా స్టార్ హీరోగా మారుతారనడం లో సందేహం లేదు. మరి ఏ మేరకు ఈ అంశాలన్నీ వరుణ్ తేజ్ కు కలిసి వస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు