DeDe Pyar De 2 : కామెడీ చిత్రంలోనూ యూనిక్ విలనిజాన్ని పండించబోతున్న విలక్షణ నటుడు?

DeDe Pyar De 2 :బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఈ ఇయర్ మంచి జోష్ లో ఉన్నాడు. రెండు నెలల కింద “సైతాన్” అనే చిన్న సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఫుల్ రన్ లో 170 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. అజయ్ దేవగన్ నటించిన “దేదే దే ప్యార్ దే” సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఇదిలా ఉండగా కోలీవుడ్ హీరో మాధ‌వ‌న్ ఇప్పుడు ఎలాంటి పాత్ర‌లు పోషిస్తున్నాడో తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆయ‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు చేస్తూ ఎంతో సెల‌క్టివ్ గా క‌నిపిస్తున్నాడు. హీరోగానే కాకుండా, ప్రత్యేక పాత్రలు చేస్తూ, వ‌య‌సు మ‌ళ్లిన వృధుడిగా.. ప్ర‌తి నాయ‌కుడిగా.. కీల‌క పాత్ర‌లు పోషిస్తూ మ్యాడీ సంపూర్ణ న‌టుడు అనిపిస్తున్నారు. న‌టుడంటే కేవ‌లం హీరో పాత్ర‌లకే పరిమితం కాద‌ని.. అన్ని ర‌కాల పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇక రెండేళ్ల కింద రాకెట్రీ అంటూ ప్రయోగాత్మక సినిమాతో సక్సెస్ అందుకున్న మాధవన్… రీసెంట్ గా సైతాన్ సినిమాలో అద్భుత నటనతో మెప్పించి శబాష్ అనిపించాడు.

Madhavan as villain in DeDe Pyar De2 movie

“దేదే ప్యార్ దే2” లో మాధవన్..

ఇక రీసెంట్ గా మాధవన్ ప్రతినాయకుడిగా న‌టించిన ‘సైతాన్’ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అజ‌య్ దేవ‌గ‌ణ్ ని ఢీకొట్టే పాత్ర‌లో మాధవన్ ఆద్యంతం ఆక‌ట్టుకున్నాడు. ఒక రకంగా మాధవన్ కే ఆ సినిమాలో ఎక్కువ మార్కులు పడ్డాయి. తాజాగా మళ్ళీ అజయ్ తో ఢీ కొట్టబోతున్నాడు. ప్ర‌స్తుతం అజ‌య్ దేవ‌గ‌ణ్‌ – ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా “దేదే ప్యార్ దే-2” (DeDe Pyar De 2) చిత్రం తెర‌కెక్కుతుంది. అన్షుల్ శ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. అయితే ఈ చిత్రంలోనూ అజ‌య్ ని ఎదురించే పాత్ర‌లో మాధవన్ న‌టిస్తున్నాడట‌. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు మాధవన్ కి స్టోరీ వినిపించాడట‌. క‌థ‌న‌చ్చ‌డంతో న‌టించ‌డానికి అంగీక‌రించినట్లు స‌మాచారం. అయితే కామెడీ సినిమాలో మ్యాడీలో విల‌నిజాన్ని ఎలా హైలైట్ చేయ‌బోతున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎలాంటి పాత్ర అయినా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు మాధ‌వ‌న్. పాత్ర‌ల ప‌రంగా మ్యాడీ ఎంపిక యూనిక్ గా ఉంటుంది. ఇక నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన స‌వ్య‌సాచిలో కూడా విల‌న్ పాత్ర తో మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

సక్సెస్ ఫుల్ గా మాధవన్ జర్నీ..

ఇక మాధవన్ తమిళ్ తో పాటు, హిందీలో కూడా తన హవా ని చాటుతున్నాడు. అటుపై మాధ‌వ‌న్ జ‌ర్నీ వివిధ ప‌రిశ్ర‌మ‌ల్లో సక్సెస్ పుల్ గానే సాగుతుంది. ప్ర‌స్తుతం హిందీ..త‌మిళ్ లోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో తెలుగులోనూ విల‌న్ పాత్ర‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ కూడా మాధ‌వ‌న్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ అలాంటి పాత్ర‌లు చేయాలంటే స్టోరీ యూనిక్ గా ఉండాలి. అలాంటి సినిమాల‌కే మ్యాడీ కమిట్ అవుతున్నాడు. మంచి బలమైన పాత్ర వస్తే తెలుగులో కూడా నటించడానికి ఎప్పుడూ సిద్ధమేనని మాధవన్ చెప్తూనే ఉంటాడు. ఇక ప్రస్తుతం హిందీలో కంగనా రనౌత్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు మాధవన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు