Anushka: షాక్.. ప్రభాస్ ప్రపోజల్నే రిజెక్ట్..!

Anushka.. స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి.. పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అటు గ్లామర్ పరంగా ఇటు సాంప్రదాయంగా కనిపించి అందరి మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.. తన కామెడీతో నవ్వించగలదు.. అలాగే ఉగ్రరూపంతో భయపెట్టగలదు కూడా.. అలా ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించి అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.. తెలుగు స్టార్ హీరోలు అందరితో కూడా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క.. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది.. ముఖ్యంగా అరుంధతి సినిమాతో తన రేంజ్ ను మార్చుకున్న ఈమె.. తెలుగు హీరోలతో సమానంగా ఈమె మార్కెట్ ఉందంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

సైజ్ జీరో తర్వాత అవకాశాలు దూరం..

చివరిగా సైజ్ జీరో, నిశ్శబ్దం సినిమాలు చేసిన ఈమె మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు.. కానీ గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది.. ఇక ఇప్పుడు మలయాళం లో తన డెబ్యూ చిత్రాన్ని మొదలుపెట్టినట్లు సమాచారం. నిజానికి ఈ మధ్యకాలంలో ఈమె అడపాదడపా సినిమాలలో నటించడానికి కారణం అధిక బరువు అని చెప్పవచ్చు.. సైజు జీరో సినిమాతో బరువు పెరిగిన అనుష్క దాదాపు బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. సైజ్ జీరో సినిమా కోసం దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాక్ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత నిశ్శబ్దం కోసం బరువు తగ్గింది కానీ పూర్వ వైభవాన్ని పొందలేకపోయింది.. ఇప్పుడు మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో కూడా ఒకరకంగా బొద్దుగా కనిపించిన ఈమె బాహుబలి తరహాలో తన అందాన్ని చూపించలేకపోయింది..

ప్రభాస్ తో ప్రేమలో..

ఇదిలా ఉండగా ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు చేరువలో వున్నా..కూడా ఇంకా వివాహం చేసుకోలేదు అనుష్క.. హీరో ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకుంటారు అంటూ ఎన్నో కథనాలు వెలుగులోకి వచ్చాయి.. కానీ అవన్నీ ప్రచారాలకే పరిమితం అవడం గమనార్హం..

- Advertisement -

ప్రభాస్ మూవీని రిజెక్ట్ చేసిన అనుష్క..

Anushka: Shock.. Prabhas rejected all proposals..!
Anushka: Shock.. Prabhas rejected all proposals..!

ఇదిలా ఉండగా ప్రభాస్ సినిమాని అనుష్క రిజెక్ట్ చేసిందనే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఆ క్యారెక్టర్ లో తాను సెట్ అవ్వను అనే ఉద్దేశంతో ప్రభాస్ సినిమా నుంచి అనుష్క తప్పుకుందని సమాచారం.. ఇక అనుష్క తప్పుకోవడంతో ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది.. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో అనుష్క సినిమా నుంచి తప్పుకొని మంచి పని చేసింది అంటూ ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఒకవేళ అనుష్క నిజంగా నటించి ఉంటే కనీసం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూసే వారైనా సినిమాని సక్సెస్ చేసేవారేమో.. మొత్తానికైతే ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం మలయాళంలోకి తొలి అడుగులు వేసిన అనుష్క అక్కడ భారీగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.. మరి తొలి డెబ్యూ మూవీ తో అనుష్క ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు