Naresh-Pavitra : సహజీవనం నుండి సంసార జీవనానికి..

సీనియర్ నటుడు నరేష్, కన్నడ నటి పవిత్ర గత కొద్ది రోజులుగా కలిసి సహజీవనం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి కొన్ని చిత్రాలలో కలిసి నటించారు. నరేష్ ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అతని మూడవ భార్య రమ్య అతనిని వదలనని చెప్పిన సరే, నరేష్ ఏమాత్రం పట్టించుకోకుండా పవిత్ర తో తన బంధాన్ని కొనసాగించాడు. ఇటు చూస్తే పవిత్ర కి కూడా ఇది రెండో పెళ్లే.

వీళ్లిద్దరు కలిసి ఉంటున్నట్లు ఎప్పటి నుండో పుకార్లు వస్తున్నాయి, ఈ వార్తని వీరిద్దరూ ఈ న్యూ ఇయర్ రోజున ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ద్వారా, అది కూడా అలా ఇలా కాదు ఏకంగా లిప్ లాక్ పెట్టుకుంటున్న వీడియో ని పెట్టి వారి పెళ్లి వార్త ప్రకటించారు. ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియా లో పెద్ద సంచలనమే సృష్టించింది.

ఈ రోజు ఉదయం వీళ్ళద్దరు పెళ్లి చేసుకున్న వీడియో నరేష్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు

- Advertisement -

మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh

అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసాక ప్రేక్షకులు ఇది నిజమేనా లేదా ఏదైనా సినిమా షూటింగ్ యొక్క భాగమా అని సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల నరేష్, పవిత్ర ఒక సినిమాలో నటించారని, సినిమాలో భాగంగా వారికి పెళ్లి కూడా జరిగిందని ఓ వార్త వచ్చింది. ఇప్పుడు అదే వీడియోను నరేష్ ట్విట్టర్ లో షేర్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే నరేష్, పవిత్ర లోకేష్ రెండు నెలల క్రితమే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు ఓ సినిమాలోని వీడియోను షేర్ చేస్తూ.. తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించానే టాక్ కూడా వినిపిస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు