Hi Nanna : బలగం డైరెక్టర్ పై కన్నేసిన నాని.. ఈ కాంబో వర్కౌట్ అవుతుందా..?

 

నాచురల్ స్టార్ నాని తన సినీ కెరియర్ లో ఎప్పుడూ కూడా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త డైరెక్టర్లు ఎవరొచ్చినా సరే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగానే ఉంటారు. అలా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఈ ఏడాది దసరా సినిమాతో సరికొత్త డైరెక్టర్ తో సినిమా చేసి రూ .100 కోట్ల మార్కును అందుకున్నారు. ఈ చిత్రంలో నాని కనిపించిన విధానం ప్రేక్షకులను, అభిమానులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

గతంలో ఎప్పుడూ లేనంతగా మాస్ హీరోగా కనిపించారు నాని. మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ప్రయోగాలను సైతం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన ఆయన హాయ్ నాన్న ఒక మరొక ప్రయోగాత్మకంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో ఒక లవ్ స్టోరీ తో డిఫరెంట్ స్టోరీగా ఉండబోతుందట. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో నాని పలు రకాలుగా విషయాలను తెలియజేయడం జరిగింది.

- Advertisement -

ఇటీవల నాని సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో సైతం చిట్ చాట్ చేస్తున్న సందర్భంగా ఎన్నో ప్రశ్నలకు స్వయంగా సమాధానాలను తెలియజేశారు. అయితే కమెడియన్ డైరెక్టర్ గా పేరు పొందిన వేణు (బలగం) గురించి స్పందించడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానాన్ని తెలియజేశారు నాని.ప్రస్తుతం ఉన్న యంగ్ టాలెంటెడ్ దర్శకులలో మీరు వర్క్ చేయాలనుకుంటున్న డైరెక్టర్ ఎవరని అడగగా..?

అందుకు సమాధానంగా నాని వెంటనే బలగం డైరెక్టర్ వేణు తో చేయాలని ఉందని.. తన మనసులో మాటని తెలియజేయడం జరిగింది. నిజంగా నాని ఆలోచించిన విధానం చాలా గొప్పదని కూడా అభిమానులు , నెటిజన్ లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో మంది యువ దర్శకులను ప్రోత్సహిస్తూ ఈ పోటీ ప్రపంచంలో కూడా ప్రత్యేకంగా ఎమోషనల్ టచ్ చేసి మంచి పాపులారిటీ అందుకున్న బలగం వేణు పైన నాని ఫోకస్ చేయడంతో అక్కడ వేణు అట్రాక్ట్ గా మారిపోయారు.

మరి ఈ కాంబినేషన్ మాత్రం మంచి కాంబినేషన్ అవుతుందని అభిమానులు తెలుపుతున్నారు. ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్లోని వేణు తన తదుపరి సినిమాని చేయబోతున్నట్లు తెలియజేశారు. మరి నానికి కూడా దిల్ రాజుతో మంచి అనుబంధమే ఉంది. కాబట్టి మరి వీరి ముగ్గురి కాంబినేషన్లో సినిమా రాబోయే రోజుల్లో సెట్ అవుతుందేమో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు