Viswam : మ్యాచో స్టార్ మూవీ బడ్జెట్ లిమిట్స్ దాటుతుందా?

Viswam : టాలీవుడ్ లో హిట్టు కోసం పరితపిస్తున్న హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలని మించి ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరో నిఖార్సైన హిట్టు కొట్టి దాదాపు పదేళ్ళయింది. అప్పుడెప్పుడో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ ఇప్పటివరకు తన రేంజ్ సక్సెస్ కొట్టలేదు. రీసెంట్ గా భీమా సినిమాతో ఎన్నో ఆశలతో కం బ్యాక్ హిట్ అందుకుందామని అనుకున్నాడు. కానీ రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించలేకపోయారు. కానీ గోపీచంద్ వన్ మ్యాన్ షో తో బిసి సెంటర్లలో పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ సాధించాడు. భీమా హిట్ కాకపోయినా గోపీచంద్ కి మాస్ లో ఉండే క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపించింది. ఇక తాజాగా గోపీచంద్ ఎంటెర్టైన్మెంట్స్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు.

ఈసారి గోపీచంద్ కొత్తగా..

టాలీవుడ్ లో హిట్ కొట్టక తప్పనిపరిస్థితుల్లో ఉన్న హీరోల్లో గోపీచంద్, అలాగే డైరెక్టర్స్ లో చాలా టైంగా హిట్ కి దూరంగా ఉన్న వాళ్ళలో శ్రీనువైట్ల ఉన్నారు. ఈ ఇద్దరికీ విశ్వం(Viswam) తో కంబ్యాక్ కొట్టక తప్పని పరిస్థితి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ను సొంతం చేసుకోవడానికి విశ్వంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయగా, టీజర్ లో గోపీచంద్ ని సీరియల్ కిల్లర్ గా చూపిస్తూ షాకిచ్చారు. ఆలా ఇచ్చిన ట్విస్ట్ తో సినిమా మీద అంచనాలను పెంచేయగా ఈ సినిమా కి విశ్వం అనే టైటిల్ ను సెంటిమెంట్ గా కన్ఫాం చేశారు. ఇంతకు ముందు గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమాలకు చివర్లో సున్నా ఉంటె హిట్ అని సెంటిమెంట్ ఉండేది.

బడ్జెట్ ఓవర్ అవుతుందా?

ఇదిలా ఉండగా వరుస ప్లాప్స్ లో ఉన్నందువల్ల గోపీచంద్ అండ్ శ్రీను వైట్ల ల విశ్వం సినిమా లో బడ్జెట్ లో తెరకెక్కుతుంది అని మొన్నటి వరకు వార్తలు రాగా, పీపుల్ మీడియా వాళ్ళు ఎంటర్ అయ్యాక బడ్జెట్ పెరిగిందని తెలుస్తుంది. ఇక టీజర్ రిలీజ్ తర్వాత సినిమా బడ్జెట్ గురించి టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తూ ఉండగా, ముందు తక్కువ బడ్జెట్ లో దాదాపు 20 కోట్ల లోపే అనుకున్నా కూడా ఇప్పుడు లిమిట్ దాటిపోయిందని సమాచారం. ఆల్ మోస్ట్ ఇప్పుడు 30 నుండి 35 కోట్ల రేంజ్ లో విశ్వం సినిమా బడ్జెట్ అవుతుందని సమాచారం. మామూలుగా గోపీచంద్ సినిమాలకు ఈ బడ్జెట్ సరైనదే అయినా, ప్లాప్ లలో ఉన్న ఈ పరిస్థితుల్లో కాస్త ఎక్కువే అని నెటిజన్లు అంటున్నారు. అయితే గోపీచంద్ గత చిత్రాలకి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా, అన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు బాగానే జరుగుతూ ఉండటంతో, ఈ సినిమా కి కూడా అలాంటి బిజినెస్ జరిగే అవకాశం ఎంతైనా ఉండటంతో బడ్జెట్ కొంచం ఎక్కువ అయినా మేకర్స్ వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో అయినా ఇటు గోపీచంద్ అటు శ్రీనువైట్ల మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు