Sabari : కోలీవుడ్ హీరోయిన్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!

Sabari.. ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ పాపులర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె మొదటిసారి 2012లో కూడా పోడా పోడి అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. అయితే హీరోయిన్ గా ఈ సినిమా ఈయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా సరే ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసింది. కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.. దాంతో తెలుగు సినిమాలలో విలన్ గా నటించి పేరు దక్కించుకుంది. ముఖ్యంగా హీరోయిన్గా కంటే నటిగానే చాలా పాపులర్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో నాంది, క్రాక్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది.. ముఖ్యంగా క్రాక్, వీరసింహారెడ్డి , యశోద సినిమాలలో ఈమె చేసిన నెగిటివ్ పాత్రలు రమ్యకృష్ణను తలపించాయనడం లో సందేహం లేదు.. అంతే కాదు హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో శబరి అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..

Sabari: Sabari producer shocking comments on Kollywood heroine..!
Sabari: Sabari producer shocking comments on Kollywood heroine..!

వరలక్ష్మి శరత్ కుమార్ పై శబరి ప్రొడ్యూసర్ కామెంట్స్..
తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన శబరి మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా.. ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు వరుణ్ సందేశ్ అలాగే బిగ్ బాస్ అమర్ దీప్. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ పై శబరి నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.. నిర్మాత మాట్లాడుతూ.. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వరుణ్ సందేశ్ కి ధన్యవాదాలు.. నా రెండో సినిమా ఇప్పుడు ఆయనతో చేస్తున్నాను.. ఆ తరువాత మూడో సినిమా అమర్దీప్ హీరోగా చేస్తున్నాను.. ఆయనకి ధన్యవాదాలు.. ఇక ఈ శబరి సినిమా విషయానికి వస్తే.. వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ గురించి అందరూ చెబుతారు కానీ బయట ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందో నేను చెబుతాను.. మేము 100 మందితో 15 రోజుల షెడ్యూలు కొడైకెనాల్ లో ప్లాన్ చేసాము.. రెండో రోజు వర్షంలో ఒక సన్నివేశం తీయాల్సి ఉంది.. ఆరోజు వరలక్ష్మి వర్షం లో చేయనని చెప్పారని డైరెక్టర్ వంశీ తెలిపారు.. దాంతో నేను అప్సెట్ అయ్యాను.. అరగంట తర్వాత మళ్ళీ వచ్చి 100 మందితో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు.. రెండో రోజు ఈ సీన్ చేయడం వల్ల నేను సిక్ అయితే నిర్మాతకు ఎంత లాస్..ఆయన ఏమైపోతారు? ఆలోచించారా ? లాస్ట్ డే ఈ సీన్ పెట్టండి.. నేను చేస్తాను అని మేడం చెప్పారు.. నిర్మాత గురించి ఆలోచించే ఆర్టిస్టులు ఉండాలి.. నిర్మాత బతికి ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు.. సినిమా ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు.. ఇక ఆవిడ మంచితనం ఎంతోమందికి ఆదర్శం అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

శబరి సినిమా విశేషాలు..
వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా అనిల్ కాట్జ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో మే మూడవ తేదీన విడుదల కాబోతోంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు