Bollywood: పవన్ కు పోటీగా వరుణ్ ధావన్.. ఎవరు గెలుస్తారో?

పవన్ కళ్యాణ్ కు పోటీగా వరుణ్ ధావన్ ఏంటి అనుకుంటున్నారా? వరుణ్ ధావన్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అనుకుంటున్నారా? అదేం కాదు. అసలు విషయం ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దీన్ని ఇప్పటికు పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో విజయ్ దళపతి హీరోగా వచ్చిన తేరి సినిమాకు అధికారిక రీమేక్ ఇది. ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను తెలుగు ఆడియన్స్ మెచ్చేలా తేయడంలో హరీష్ శంకర్ కు పట్టు ఎక్కువ ఉంది. అందుకే రీమేక్ సినిమాలు చేస్తాడు అనే పేరున్నా.. ఆయనకు అవకాశాలు ఇస్తారు హీరోలు.

అయితే తేరి సినిమాకు హిందీలో కూడా రీమేక్ రాబోతుంది. ఈ హిందీ రీమేక్ లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీకి తేరికి దర్శకత్వం వహించిన అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అట్లీ స్నేహితుడు కలీస్ డైరెక్టర్. అయితే పవన్ కళ్యాన్ రాజకీయ పరిస్థితల వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ తాత్కాళికంగా వాయిదా పడింది. దీంతో హరీష్ శంకర్ కూడా రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ టైంలోనే తేరి హిందీ రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

- Advertisement -

అంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందే తేరి హిందీ రీమేక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ సినిమాకు కొంత వరకు నష్టం తీసుకురావొచ్చు. ఎందుకంటే, ఒక స్టోరీ ఒక సినిమాగా చూడటానికే ఇష్టపడుతారు. దీన్ని మళ్లీ హిందీ రీమేక్ చేసిన తర్వాత తెలుగులో వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంట్రెస్ట్ ఉంటుందా అనేది ఇప్పుడు ప్రశ్న.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు