Trivikram : “గుంటూరు కారం” కాపీ కథే… దొరికిపోయిన గురూజీ

Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “గుంటూరు కారం” మూవీ ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ మూవీలో ఊర మాస్ లుక్ లో కనిపించడంతో పాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, అభిమానులు మహేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అంశాలన్నీ “గుంటూరు కారం” మూవీలో పేరుకు తగ్గట్టే ఘాటుగా ఉంటాయని మేకర్స్ ప్రామిస్ చేశారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు యావరేజ్ టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే “గుంటూరు కారం” మూవీని చూసినవాళ్లు గురూజీ మలయాళ మూవీని దించేశాడు అంటూ ఈ మూవీ కాపీ అనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు.

ఇప్పటికే “గుంటూరు కారం” మూవీని చూసినవాళ్లు ఈ మూవీ అజ్ఞాతవాసి, అల వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది వంటి సినిమాలను కలిపి కొట్టేసినట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. “గుంటూరు కారం” మూవీ కథను గమనిస్తే ఇందులో హీరో తల్లికి ఇద్దరు భర్తలు ఉంటారు. “అజ్ఞాతవాసి” మూవీలో హీరో తండ్రికి ఇద్దరు భార్యలు ఉంటారు మిగతాదంతా సేమ్ టు సేమ్. అలాగే అత్తారింటికి దారేది సినిమాలో అత్త, అల్లుళ్ల మధ్య జరిగే క్లైమాక్స్ ఈ మూవీలో తల్లి, కొడుకుల మధ్య జరుగుతుంది. అలా వైకుంఠపురంలో లాగే ఈ మూవీలోను హీరో తన కుటుంబానికి దూరంగా పెరుగుతాడు.

ఇవన్నీ పక్కన పెడితే గురూజీ త్రివిక్రమ్ మలయాళ మూవీని దించేశాడు అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన “రాజమాణిక్యం” అనే మూవీ కథనే తీసుకుని త్రివిక్రమ్ “గుంటూరు కారం” మూవీని రూపొందించారని మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ మేరకు ప్రూఫ్ తో సహా బయట పెడుతున్నారు. 2005లో విడుదలైన “రాజమాణిక్యం” మూవీకి అన్వర్ రషీద్ దర్శకత్వం వహించాడు.

- Advertisement -

“రాజమాణిక్యం” మూవీ కథ విషయానికి వస్తే… ఈ మూవీలో హీరోను తల్లి వదిలేస్తుంది. కుటుంబానికి దూరంగా వెళ్లిపోయి, గ్యాంగ్ స్టర్ గా మారిన హీరో ఆ తర్వాత కుటుంబంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి తిరిగి వస్తాడు. అలాగే అతనికి ఒక కన్ను కనిపించదు. ఇదే కోర్ లైన్ ను తీసుకుని త్రివిక్రమ్ “గుంటూరు కారం” మూవీని తీశాడు. “గుంటూరు కారం” మూవీలో రాజకీయాల కారణాల వల్ల కొడుకును వదిలేసి వెళ్ళిపోతుంది తల్లి. చిన్నప్పుడే ఓ ప్రమాదంలో హీరో కన్ను దెబ్బతింటుంది. దానివల్ల అతనికి ఒక కన్ను కనిపించదు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం హీరో తల్లి వేరే పెళ్లి చేసుకుంటుంది.

ఆ తర్వాత ఏర్పడిన కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి హీరో వదిలేసిన తన తల్లి దగ్గరికి చేరాల్సి వస్తుంది. ఈ మూవీలో మహేష్ రమణ గాడి పాత్రలో కనిపిస్తే, అప్పట్లోనే మమ్ముట్టి బళ్లారి రాజా అనే పాత్రతో కేరళను షేక్ చేశాడు. మమ్ముట్టి కెరీర్లో కల్ట్ మూవీగా నిలిచిన “రాజమాణిక్యం” మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పైగా మమ్ముట్టి కామెడీ చేయలేడు అంటూ వచ్చిన విమర్శలకు ఈ మూవీ చెక్ పెట్టింది. మొత్తానికి గురూజీ “రాజమాణిక్యం” మూవీ స్టోరీని కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయాడు. దాదాపు 30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మూవీ కదా ఎవడు గుర్తుపడతాడులే అనుకుని ఉంటారు. కానీ నెటిజన్లు మాత్రం ఇది కాపీ కథ అని గుర్తు పట్టి కుర్చీ మడత పెట్టేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు