Siddharth: మొదటి భార్య ఎవరో తెలుసా.. విడాకులు ఎందుకు ఇచ్చాడంటే..?

Siddharth: ఒకప్పుడు యంగ్ హీరోలైన ఉదయ్ కిరణ్, తరుణ్, రోహిత్, నితిన్, సిద్ధార్థ్ లాంటి వారు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని యువతుల కలల రాకుమారులుగా కొనసాగారు. ఎన్నో ప్రేమ కథా సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే వీరిలో ఉదయ్ కిరణ్ చనిపోగా.. తరుణ్ పూర్తిగా సినిమాలకు దూరమైయ్యారు. ఇక నితిన్ వరుసగా సినిమాలు చేస్తుండగా.. సిద్ధార్థ్ మాత్రం అడపాదడపా సినిమాలతో నేను ఉన్నానంటూ గుర్తుచేస్తున్నాడు.

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట ఇలా చాలా సినిమాలలో లవర్ బాయ్ గా అభిమానుల మనసు దోచుకున్న సిద్ధార్థ్.. వరుస అవకాశాలు వచ్చినా సరైన సక్సెస్ లేక కెరీర్ నాశనం చేసుకున్నాడు. అలాగే చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ ఆయనపై పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సిద్ధార్థ్ కి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటూ ఆ మధ్య ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే పిల్లల విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ.. సిద్ధార్థ్ కి మేఘన అనే అమ్మాయితో 2003లో పెళ్లి జరిగింది.

నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. మేఘన గురించి అత్యంత సన్నిహితులకు తప్పితే బయట అంతగా తెలియదు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా టాక్. కానీ దీనిపై క్లారిటీ లేదు. అయితే సిద్ధార్థ్ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి ఓ హీరోయినే కారణం అంట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్. ఆ మధ్య వీరిద్దరూ రిలేషన్ లో ఉండడం వల్లే మేఘనాతో విభేదాలు వచ్చి విడిపోయారని సమాచారం. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ అతిధిరావు హైదరితో ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు