SJ Surya Mollywood Entry : మలయాళ ఎంట్రీకి రంగం సిద్ధం… “పుష్ప” విలన్ తో కలిసి పెద్ద ప్లానే

SJ Surya Mollywood Entry : కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఎన్నో తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఎస్జే సూర్య ఇప్పుడు మలయాళ ప్రేక్షకులను తన యాక్టింగ్ స్కిల్స్ తో మ్యాజిక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పుష్ప విలన్ తో కలిసి మలయాళ ఎంట్రీకి పెద్ద స్కెచ్చే వేశాడు.

మలయాళ ఎంట్రీకి రంగం సిద్ధం…

ఎస్జే సూర్య మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అన్న విషయం తెలిసిందే. ఆయన నటుడు మాత్రమే కాదు దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. తమిళ చిత్ర సినిమాలో డైరెక్టర్ గా కంటే నటుడిగానే ఎక్కువగా సక్సెస్ అయ్యారు సూర్య. ఇప్పటిదాకా విలన్ గా, హీరోగా, సపోర్టింగ్ యాక్టర్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సూర్య ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ పై కన్నేశారు. పాపులర్ డైరెక్టర్ విపిన్ దాస్ నెక్స్ట్ మూవీలో సూర్య నటించబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం మాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సినిమాలో ఆయన మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమాలో భాగం కాబోతున్న మిగతా నటీనటుల వివరాల గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మొత్తానికి వెటరన్ యాక్టర్స్ సూర్య, ఫాహద్ ఫాసిల్ కలిసి నటించబోతున్నారనే వార్త ఇరువురి స్టార్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

ఎస్జే సూర్య సినిమాల విషయానికి వస్తే…

గత ఏడాది జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో కనిపించాడు సూర్య. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించగా, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు సూర్య.

- Advertisement -

ఫాహద్ ఫాజిల్ సినిమాల విషయానికి వస్తే…

ఫాహద్ హీరోగా నటించిన ఆవేశం మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలోకి రాబోతోంది. అలాగే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 : ది రూల్ లో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్ట్ 15 న థియేటర్లలోకి రాబోతోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ మూవీలో కీలక పాత్రకు ఎంపికయ్యారు.

ఇక డైరెక్టర్ బిపిన్ దాస్ విషయానికి వస్తే..

జయ జయ జయహే మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నారు డైరెక్టర్ బిపిన్ దాస్. బాసిల్ జోసెఫ్, దర్శన్ రాజేంద్రన్ ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ డైరెక్టర్ ఇటీవలే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి గురువాయూర్ అంబలనాదయిల్ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు. ఇప్పుడు ఫాహద్, ఎస్జే సూర్యలతో కలిసి డైరెక్టర్ బిపిన్ దాస్ మరో ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు