Indian 2 Official Release Date : అఫిషియల్ రిలీజ్ డేట్ అవుట్… కానీ పూర్తిగా కాదు

Indian 2 Official Release Date : లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో భారతీయుడు సినిమాతో ఈ కాంబో సంచలనం సృష్టించగా, చాలా కాలం గ్యాప్ తరువాత ఇండియన్ 2 మూవీకి శ్రీకారం చుట్టారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని పట్టాలెక్కిన ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇండియన్ 2 రిలీజ్ డేట్ ను మేకర్స్ పూర్తిగా బయట ఆపెట్టకపోవడం గమనార్హం. మరి ఇంతకీ ఇండియన్ 2 రిలీజ్ ఎప్పుడంటే?

రిలీజ్ డేట్ అఫిషియల్ అనౌన్స్మెంట్

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా మూవీ రిలీజ్ డేట్ గురించి గత కొంతకాలంగా డైలమా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ 2 మూవీని జూన్ 13న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఈరోజు మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో సాయంత్రం 6 గంటలకు ఓ అప్డేట్ రాబోతోంది అంటూ కమల్ అభిమానులను అలెర్ట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా మూవీ రిలీజ్ డేట్ గురించిన అప్డేట్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. సాయంత్రం వరకు క్యూరియాసిటీతో ఈ అప్డేట్ గురించి ఎదురు చూసిన కమల్ ఫ్యాన్స్ కు చిరాకెత్తే పని చేశారు మేకర్స్. ఊహించినట్టుగానే తాజాగా ఇండియన్ 2 మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తాజాగా కమల్ హాసన్ ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ అందులో ఇండియన్ 2 మూవీ జూన్ లో రిలీజ్ కాబోతుందని వెల్లడించారు. అయితే డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా మళ్లీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఎన్నో అవాంతరాలను దాటుకుని…

ఇండియన్ 2 మూవీకి ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. ఓ ప్రమాదంలో క్రూ నెంబర్ మరణించారు. ఆ తర్వాత బడ్జెట్ సమస్యల ఈ మూవీని మధ్యలోనే ఆపేశారు. దీంతో కమల్ హాసన్ విక్రమ్ మూవీపై దృష్టి పెట్టారు. మరోవైపు శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సడన్ గా నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ ఎంట్రీతో సమస్యలు అన్నింటిని అధిగమించి ఇండియన్ 2 మూవీని పట్టాలెక్కించారు శంకర్, కమల్ హాసన్. దీంతో శంకర్ అప్పటికే కమిట్ అయిన గేమ్ ఛేంజర్ మూవీని పక్కన పెట్టి ఇండియన్ 2తోపాటు పార్ట్ 3 షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. భారతీయుడు సినిమాను మించిపోయేలా భారతీయుడు 2ను ప్లాన్ చేశారు. కానీ ఇప్పటికి కూడా పూర్తిగా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టిన శంకర్ పై కమల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

- Advertisement -

కాగా ఈ మూవీలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో ఎస్ జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్, మధుబాల, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిది స్టాలిన్, సుభాస్కరన్ ఇండియన్ 2 మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు