Samantha’s Kushi: విజయ్ కి వైఫ్ అయ్యే క్వాలిటీస్ అన్నీ సమంతలో ఉన్నాయా..?

Samantha’s Kushi

లేడీ సూపర్ స్టార్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ లో విజయ్ సమంత మధ్య కెమిస్ట్రీ హైలైట్ అవ్వటంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తోంది సినిమా యూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విజయ్ ద్వేరకొండ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఎవరో ప్రెజర్  పెడుతున్నారని పెళ్లి చేసుకోవటం తనకి నచ్చదని, చేసుకోవాలని అనిపించినప్పుడే చేసుకుంటానని అన్నాడు విజయ్.
తనకి కాబోయే భార్య ఎలా ఉండాలో అంటూ విజయ్ చెప్పిన క్వాలిటీస్ ఆసక్తికరంగా ఉన్నాయి. తనకి కాబోయే వైఫ్ చాలా ఇంటెలిజెంట్ అయ్యుండాలని, తన తిండి విషయం డాగర నుండి హాలిడే విషయం వరకు ప్రతిదీ గుర్తు చేసే అమ్మాయి కావాలని. ముఖ్యంగా తనతో పాటు ప్రతి చిన్న విషయాన్నీ కూడా ఆస్వాదించగలిగేలా ఉండాలని అన్నాడు.
విజయ్ చెప్పిన చెప్పిన క్వాలిటీస్ పై నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. విజయ్ ఇండైరెక్ట్ గా రష్మిక, సమంతాలలో ఉన్న క్వాలిటీస్ గురించి చెప్పాడని అంటున్నారు. మరికొంత మంది అయితే, విజయ్ మనసులో సమంత ఉందని, అతను చెప్పిన క్వాలిటీస్ అన్నీ సమంతలో ఉన్నాయని, ట్రైలర్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసినప్పుడే ఎదో ఉందని అనుమానం వచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు