Samantha: చైతూ పై కోపం పై మళ్ళీ పెళ్లి కి సిద్ధమైన సామ్..!

Samantha

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది హీరోయిన్ సమంత.. సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.. ఈమె కెరియర్ ప్రారంభం నుంచే లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. అయితే గత కొంతకాలంగా తన పర్సనల్ విషయాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి చాలా డిప్రెషన్ కి గురైంది. ప్రేమించి మరీ సమంత – నాగచైతన్య వివాహం చేసుకున్నప్పటికీ నాలుగేళ్లకే ఆ బంధాన్ని ముగించారు.

అలా సమంత , నాగచైతన్య విడిపోయి ఇప్పటికీ రెండేళ్లు అవుతున్నా వారి గురించి ఏదో ఒక న్యూస్ తరచూ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.. తాజాగా ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు రకాల వార్తలు వెలువడుతున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణం నాగచైతన్య మీద కోపంతోనే అని.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ గతంలో కూడా ఎన్నోసార్లు సమంత రెండో పెళ్లిపై రూమర్స్ వినిపించాయి.

ఒకానొక సందర్భంలో రెండో పెళ్లి వార్తల పై సమంత స్పందించి మరోసారి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ మాత్రం తనకు లేదని.. పైగా విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కూడా విడిపోతున్నాయంటూ ఆమె తెలిపింది.. సో దీన్ని బట్టి చూస్తే సమంత రెండో పెళ్లి విషయం కేవలం రూమర్స్ అని కూడా చెప్పవచ్చు.. ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. అందుకే పలు దేశాలలో తిరుగుతూ ..అక్కడ రెస్ట్ తీసుకుంటోంది.

- Advertisement -

త్వరలోనే సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి డబ్బింగ్ కూడా ఇటీవల చెప్పినట్లుగా పలు రకాల ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతమైతే సమంత ను .. రామ్ చరణ్ కు జోడీ గా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న RC16 సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసేందుకు ఆమెను సంప్రదించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్ కూడా రానుంది. ఇక సమంత తదుపరి సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూపుస్తున్నారు. మరి ఈ విషయం పై సమంత క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు