Ramayan: రణబీర్ రామాయణంలో సీతగా సాయి పల్లవి ఔట్..యంగ్ హీరోయిన్ ఇన్..!

Ramayan

సౌత్ టు నార్త్ ఎంతోమంది దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం.. ఈ సినిమాని ఎన్ని రకాలుగా తెరకెక్కించినా సరే ఏదో ఒక అద్భుతమైన విషయం మాత్రం ప్రేక్షకులకు అర్థమవుతుంది అనడంలో సందేహం లేదు.. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ కూడా రామాయణ కథ ఆధారంగా సినిమా చేయాలని ప్లాన్ చేస్తుండగా ఇప్పటికే అన్ని సన్నహాలు కూడా పూర్తి చేశారు.. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తారని.. రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యశ్ నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు సీతగా మొదట రణబీర్ భార్య అలియా భట్ ను సంప్రదించగా ఆమె కొన్ని కారణాలవల్ల తప్పుకోవడంతో ఆ స్థానంలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి.

అంతేకాదు లుక్ టెస్ట్ చేయగా పర్ఫెక్ట్ గా సూట్ అయిందని.. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెడతారు అంటూ వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు తాజాగా ఈ సీత పాత్ర గురించి మరొక వార్త తెరపైకి వచ్చింది.. రామాయణం సినిమాకి సంబంధించి ఒకటి రెండు వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.. రాముడి పాత్రలో రణబీర్ నటిస్తూ ఉండగా సీత పాత్రకు దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సీతగా నటించే అవకాశం ఉందని అంటున్నారు..

రామాయణంలో జాన్వీ కపూర్.. అంటూ తెరపైకి ఒక కొత్త వార్త వచ్చింది.. నితీష్ తివారి రామాయణంలో సీత పాత్రలో జాన్వీ కపూర్ కనిపించనుంది అంటూ వార్తలు వస్తున్నాయి.. అంతేకాదు చిత్ర బృందం ఇప్పటికే ఆమెతో సంప్రదించినట్లు సమాచారం .. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం సౌత్ సినిమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో.. వాటిని పక్కన పెడుతుందా లేక సినిమాల్లో బిజీ కారణంగా ఈ సినిమాకి నో చెబుతుందా అన్నది తెలియాల్సి ఉంది.. మొత్తానికైతే సీతగా జాన్వి కపూర్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందో లేదో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

మరొకవైపు ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.. దీనిపై త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.. అప్డేట్ లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నితీష్ టీం కూడా ఈ సినిమా కోసం చాలా కసరత్తులు చేస్తూ ఉండగా.. బ్లూ ప్రింట్ కూడా సిద్ధమైంది.. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డిఎన్ఈజీ చిత్రం యొక్క విఎఫ్ఎక్స్ కోసం ఎంపిక చేయబడింది.. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్ళనుంది…

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు