TheBull : జవాన్ సెంటిమెంట్ తో సల్లు భాయ్.. వర్కౌట్ అవ్వుద్దా?

బాలీవుడ్ లో గత ఏడాది కాలంగా సౌత్ ట్రెండ్ నడుస్తుంది. ఇంతకు ముందు బాలీవుడ్ లో సినిమాలు సౌత్ సినిమాలు మాత్రమే రీమేక్ చేసే మేకర్స్, ఇప్పుడు ప్రొడ్యూసర్లు, హీరోలు సౌత్ లోనే సినిమాలు చేస్తూ, సౌత్ డైరెక్టర్లతో సినిమాలు కూడా తీయడానికి రెడీ అయ్యారు. ఒకప్పుడు జితేంద్ర, అనిల్ కపూర్ లాంటి వాళ్ళు మాత్రమే చేసేవారు. ఖాన్ త్రయం జెనరేషన్ వచ్చాక సౌత్ మేకర్స్ తో సినిమాలు చేయడమే తగ్గించారు. అయితే బాహుబలి, కెజిఎఫ్ లాంటి సినిమాల తర్వాత ఆ లెక్కే మారిపోయింది. సౌత్ రేంజ్ ఏంటో బాలీవుడ్ వాళ్ళకి తెలిసింది.

పైగా లాక్ డౌన్ తర్వాత వాళ్ళు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు సౌత్ డైరెక్టర్లతో ఎగబడి సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ నిర్మాతలు. ఇక 2023 లో బాలీవుడ్ లో భారీ బ్లాక్ బూస్టర్లు గా నిలిచిన జవాన్, అనిమల్ తీసింది సౌత్ డైరెక్టర్లే అన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా సౌత్ డైరెక్టర్లను నమ్ముకున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విష్ణువర్ధన్ తో సల్మాన్ ఖాన్ సినిమా చేయబోతున్నాడని తాజాగా సమాచారం అందింది. ఇక ఈ దర్శకుడు తెలుగులో పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క డైరెక్టర్ నే కాకుండా జవాన్ సినిమా లాగా ఈ సినిమాలో కూడా సౌత్ కాస్టింగ్ ని బాగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా ఓ తమిళ హీరోని తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా మరోసారి అనిరుధ్ మ్యూజిక్ అందించే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతను లేకపోతే విష్ణువర్ధన్ ఫెవరేట్ యువన్ శంకర్ రాజా ఉండనే ఉన్నాడు.

- Advertisement -

ఇక విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించే ఈ సినిమాకు “ది బుల్” అని టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమాను బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కేది ఫిబ్రవరి మొదటి వారంలోనట. ఏది ఏమైనా సౌత్ ఇండస్ట్రీ ని ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు బాగానే నమ్ముకున్నారు. కానీ దీనికి తోడు కంటెంట్ కూడా పడాల్సిందే. మరి జవాన్ కి వర్కౌట్ అయిన సౌత్ సెంటిమెంట్ సల్లూ భాయ్ సినిమాకి కూడా వర్కౌట్ అవ్వుద్దా అనేది చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు