Ravanasura: బుద్ధి రాలేదా…? మళ్లీ అదే తప్పు చేస్తున్న రవితేజ?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, సొంతంగా కష్టపడి ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌లో ఉన్నవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారికి ఇన్‌స్పైరేషన్ మాస్ మహరాజ రవితేజ. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ చిన్న చితక సినిమాలు చేసే రవితేజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో అంటే దానికి ఆయన ఎంత కష్టపడ్డాడో తెలిసిపోతుంది. అందుకే రవితేజకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ.

అయితే బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న రవితేజ ఇప్పుడు వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు. ధమాకాతో పాటు చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య ఎలాంటి విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. దీని తర్వాత చేసిన రావణాసుర మాత్రం మళ్లీ పెద్ద దెబ్బ తీసింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టార్ గా నిలిచింది. దీనికి కారణం.. రవితేజ నెగిటివ్ షెడ్స్ లో కనిపించడమే అని ఫ్యాన్స్ చెబుతుంటారు. అంతే కాదు, రవితేజ మళ్లీ నెగిటివ్ షెడ్స్ కనిపించొద్దు అని కూడా అంటున్నారు.

కానీ, రవితేజ మరోసారి అదే తప్పు చేయబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఎప్పుడూ కొత్త డైరెక్టర్స్ ఎంకరైజ్ చేసే రవితేజ.. ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తే తప్పేంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలు తప్పు… ఈ కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీలో రవితేజ విలన్ రోల్ చేయాల్సి ఉంటుందట. అయితే హీరోగా రవితేజనే డ్యూయల్ రోల్ చేస్తాడా? లేదా మరొక హీరోను తీసుకుంటురా అనేది తెలియాల్సి ఉంది. కానీ రవితేజ మరోసారి విలన్ రోల్ అంటే ఫ్యాన్స్ అగ్రీ అవ్వడం లేదు.

- Advertisement -

రవాణాసుర ఇచ్చిన రిజెల్ట్ ను తాము ఇంకా మర్చిపోలేకపోతున్నామని, మళ్లీ ఇప్పుడు మరోసారి అలాంటి రిజెల్ట్ వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని వాపోతున్నారు రవితేజ ఫ్యాన్స్ . చూడాలి మరీ… రవాణాసుర రిజెల్ట్ గుర్తొచ్చి.. ఈ విలన్ రోల్ ను వదులుకుంటడా? లేదా కొత్త దనం పేరుతో ఈ విలన్ రోల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు