Ranbir kapoor : యానిమల్ లో ఐటెం సాంగ్ చేయబోతున్న పూజా హెగ్డే

ప్రస్తుతం వస్తున్న సినిమాలలో ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్, స్టైల్ గా పిలుచుకునే ఐటెం సాంగ్. పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు ఏ సినిమాలోనైనా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఈమధ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేయడంతో సినిమా లుక్కే మారిపోతుంది. ఒకప్పుడు సినిమాల్లో ఐటెం సాంగ్ అంటే ప్రత్యేకించి కొందరు నటులు మాత్రమే చేసేవాళ్లు. కానీ రాను రాను ఐటెం సాంగ్స్ కు పెరిగిన క్రేజ్ తో పెద్ద హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్ చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఐదు నిమిషాల పాటు అందాలు ఆరబోసేందుకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పటికే ఐటమ్ సాంగ్స్ లో స్టెప్పులేసి కనువిందు చేయగా.. టాలీవుడ్ లో జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్ప లో సమంత, గని లో తమన్నా, ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ వంగా.. ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో ఉన్నాడు. ఈ క్రమంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు సందీప్.

ఈ క్రమంలోనే ప్రస్తుతం స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో  హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా.. స్పెషల్ సాంగ్  కోసం పూజా హెగ్డే ని సంప్రదించారట.ఇప్పటికే ఎఫ్3 , రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ, ఇటీవలనే బాలీవుడ్ లో కిసి కా భాయ్ కిసీకి జాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సెట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్న పూజ మరీఈ బాలీవుడ్ ఐటెం నెంబర్ కి ఒకే చెబుతుందో, లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు