Raashi Khanna : రాశి ఖన్నాకు భయంకరమైన వ్యాధి !

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్లలో ఒకరైన రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి సందడి చేసిన రాశిఖన్నా… ఊహలు గుసగుసలాడే చిత్రంతో పూర్తిస్థాయి హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. తాజాగా రాశి ఖన్నాకు హిందీ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి.

ఒకవైపు సౌత్ లో వరుసగా సినిమాలలో నటిస్తూనే హిందీలో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇక ఈ మధ్యకాలంలో రాశిఖన్నా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటుందని చెప్పాలి. అయితేఇక విషయానికొస్తే తాజాగా రాశి ఖన్నాకు ఓ భయంకరమైన వ్యాధి సోకినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ విషయాలను స్వయంగా రాశి ఖన్నానే చెప్పింది. రాశి ఖన్నాకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది.
“నేను మొదట్లో PCOD సమస్యతో ఇబ్బంది పడ్డాను. ఆ వ్యాధి కారణంగా అప్పట్లో చాలా బరువు పెరిగాను” అని పేర్కొంది రాశి ఖన్నా. తాను సౌత్ కు ఎంట్రీ ఇచ్చే సమయానికి చాలా లావుగా ఉండేదాన్న, దాంతో తనని చూసిన వారంతా గ్యాస్ ట్యాంకర్ అంటూ ట్రోల్స్ చేసేవారని వివరించింది. అయితే వైద్యుల సహాయంతో ఆ వ్యాధిని తగ్గించుకుందట ఈ భామ. ఇప్పుడు తనకు ఆ సమస్య చాలా వరకు తగ్గిపోయిందని, భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా చికిత్స తీసుకున్నట్లు రాశి ఖన్నా పేర్కొంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు