Naa Saami Ranga: నాగార్జున లేకుండానే నా సామి రంగ- కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

నాగార్జున లేటెస్ట్ చిత్రం నా సామి రంగ సినిమా అక్కినేని అభిమానుల్లో కొత్త కన్ఫ్యూజన్స్ ను క్రియేట్ చేస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలనే నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఇప్పటి వరకు నాగార్జున నా సామి రంగ టీజర్ షూట్ లో తప్ప సినిమా సెట్ లో అడుగుపెట్టలేదని టాక్ వినిపిస్తోంది.

దీనికి కారణం ఆ సినిమాకు సంబంధించి ఇంకా చాలా ప్రి ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండటమే అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. నా సామి రంగ సినిమా నిజానికి మలయాళం లో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. నాగార్జున తో పాటు ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు ప్రముఖ పాత్రలలో కనిపించబోతున్నారు. యం.యం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే నా సామి రంగ సినిమాకు సంబంధించి క్యాస్ట్ అండ్ మూవీ క్రూ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండనే ఉంది. అయితే అసలు కన్ఫ్యూజన్ అంత సినిమా షూటింగ్ లోనే వస్తుంది. టీజర్ వీడియోలో ఎలాగైనా సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ డేట్ ఎనౌన్స్ చేసేసారు. కానీ సినిమా పరిస్థితి చూస్తే సంక్రాంతికి వచ్చేలాగా లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలనే నా సామి రంగ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ యం యం కీరవాణి తో జరుగుతున్నాయంటూ డైరెక్టర్ విజయ్ బిన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

- Advertisement -

ఇక అంతలోనే నా సామి రంగ షూటింగ్ టైం మూవీ సెట్ దిగినఫోటో ను కొద్దీ రోజుల క్రితమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు అఫీషయల్ గా మొదలైందా లేదా, షూటింగ్ నిజంగానే జరుగుతుందా లేదా టెస్ట్ షూట్స్ ఏమైనా చేస్తున్నారా అనే విషయం అంతు చిక్కడం లేదు.

ఎలాగైనా సంక్రాంతికి తీసుకు రావాలని నాగార్జున పట్టుబట్టుకొని ఉన్న కూడా ఇంత వర్క్ బ్యాలెన్స్ పెట్టుకొని సంక్రాంతి రిలీజ్ సాధ్యమేనా లేదా అనేది అక్కినేని అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ ను కలిగిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పరిస్థితీ ఎలా ఉన్న నాగార్జున బిగ్ బాస్ ద్వారా మాత్రం ప్రతి వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు