Mokshagna: చాలా పగడ్బందీగా ప్లాన్ చేసారు మైక్

Mokshajna: నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు సినిమాని, తెలుగు కీర్తిని శిఖరం మీద కూర్చోబెట్టిన ఘనత నందమూరి తారక రామారావుది. సినీనటుడుగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సంచలనాలు సృష్టించారు నందమూరి తారక రామారావు. ఇక నందమూరి వారసత్వానికి వస్తే చాలామంది ఆయన కుమారులుగా ఉన్నా కూడా కేవలం బాలకృష్ణ, హరికృష్ణ మాత్రమే సినీ రంగ ప్రవేశం చేశారు.

వారిలో హరికృష్ణ చేసిన సినిమాలు అంతంత మాత్రమే. ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో నందమూరి వంశం నుంచి ఉంది బాలకృష్ణ ఒకరిని చెప్పొచ్చు. బాలకృష్ణ కూడా సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత హరికృష్ణ కొడుకుగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో మంచి సినిమాలు చేసుకుంటూ తను కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంటున్నాడు. అయితే ఎన్టీఆర్ కి నట వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని చాలామంది చెబుతారు .

ఇకపోతే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఆ దిశలోనే మోక్షజ్ఞ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నందమూరి వారసుడి ఎంట్రీ కోసం బాలయ్యతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయని గత రెండేళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ నటనా రంగ ప్రవేశానికి దాదాపు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మోక్షజ్ఞ వైజాగ్‌లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ ప్రస్తుతం ప్రముఖ యాక్టింగ్ గురు సత్యానంద్ దగ్గర యాక్టింగ్ పాఠాలు నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈయన ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకు నటనలో సూక్ష్మ నైపుణ్యాలను నేర్పించారు. అలాంటి పెద్దాయన ఇప్పుడు మోక్షజ్ఞను యాక్టింగ్ స్కూల్‌లో చక్కటి పెర్ఫార్మర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. నటన శిక్షణతో పాటు, మోక్షజ్ఞ తన బాడీ విషయంలో కూడా కష్టపడి పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అరంగేట్రానికి సంబంధించిన అధికారక ప్రకటన కొన్ని రోజుల్లో రానుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు