Megastar: చిరంజీవి ముద్దు పెట్టుకుంటుంటే తోసేసిన స్టార్ హీరోయిన్..!

మెగాస్టార్ చిరంజీవి.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు చిరంజీవి. ఇక ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చేలా చేశారు మెగాస్టార్. ఇప్పటికీ చిరుతో నటించాలని ఎదురుచూసే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి స్టార్ హీరోతో సినిమాలో రొమాన్స్ చేసే అవకాశం వస్తే తనకు ఇష్టం లేదని మొహం మీదే చెప్పేసిందట ఓ స్టార్ హీరోయిన్.

ఆమె మరెవరో కాదు నగ్మా. మెగాస్టార్ చిరంజీవి – నగ్మా కాంబోలో ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలోని సన్నివేశాలు చూస్తే జనాలకి చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఘరానా మొగుడు సినిమాలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు.. చిరంజీవితో నేను అలా చేయలేకపోతున్నాను అని, ఓ రొమాంటిక్ సన్నివేశంలో చిరు ముద్దు పెట్టడానికి వస్తుంటే ఏకంగా వెనక్కి తోసేసిందట.

మీతో రొమాన్స్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పి షూటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయిందట. దీంతో ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న రాఘవేంద్రరావు – చిరంజీవి సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాలను కాస్త రూట్ మార్చి తెరకెక్కించారట. దీని గురించి గతంలోనే పెద్ద ఎత్తున రూమర్స్ రాగా ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు