Manchu Manoj: తండ్రిని దూరం పెడుతున్న మంచు మనోజ్.. నిజమేనా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచు మనోజ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన సినిమాలతో ప్రేక్షకులను భారీగా తన అభిమానులుగా మార్చుకొని.. తన వ్యక్తిత్వంతో సెలబ్రిటీలను కూడా తన అభిమానులుగా మార్చుకున్నారు. మొన్నటి వరకు వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారని చెప్పాలి. అయితే ఒకటి రెండు ప్రాజెక్టులను ప్రకటించినప్పటికీ కూడా పెద్దగా అవి తెరపైకి రాకపోవడం గమనార్హం . ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత సినిమాలకు దూరం అయిన మంచు మనోజ్ మొదటి భార్యతో విడాకులు.. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డితో ప్రేమాయణం .. కుటుంబంలో వ్యతిరేకతలు, అన్నతో గొడవలు ఇలా అన్నీ కూడా ఆయనను మరింతగా కృంగదీసాయి.

అయితే అన్నింటినీ ఎదిరించి.. ప్రస్తుతం భూమా మౌనికతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇకపోతే ఇప్పుడు భర్తగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని.. తన భార్యకు మాత్రమే తోడుగా ఉంటానని చెప్పి పలు అనుమానాలకు దారి తీశారు మంచు మనోజ్. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా పాలిటిక్స్ లోకి మంచు మనోజ్ రాబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇలా వార్తలు వస్తున్న నేపథ్యంలో తన తండ్రి మోహన్ బాబు విధేయులుగా ఉన్న వైసిపి పార్టీకి మద్దతు పలుకుతారా? లేక తన భార్య మౌనిక రెడ్డి కుటుంబం విధేయులుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతారా ? అన్న వార్తలు బాగా వినిపించాయి.

అంతేకాదు మౌనిక కోసం టీడీపీ లోకి వెళ్ళబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు మళ్లీ తన తన భార్యకు మాత్రమే తోడుగా ఉంటానని చెప్పడంతో.. ఇక ఈయన తన తండ్రిని కూడా భార్య కోసం దూరం చేసుకోబోతున్నారు అని.. రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో చాలా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇకపోతే మంచు మనోజ్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన సినిమా కెరియర్ కి మాత్రం కాస్త పులిస్టాప్ పడిందని చెప్పాలి. అందుకే ఇప్పుడు బుల్లితెరపై తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.. ఉస్తాద్ అంటూ ఒక కొత్త షో తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు మంచు మనోజ్. తాజాగా ఈ షో ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన ఈయన త్వరలోనే ఈ షో తో ఆడియన్స్ ని అలరించబోతున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు