Tollywood News: @54 లో ప్రేమ పెళ్లి కావాలంటున్న హీరోయిన్.. కానీ..!

Lakshmi gopalaswamy: ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని తల్లిదండ్రులవుతుంటే.. మరికొంతమంది నాలుగు పదుల వయసు వచ్చినా సరే వివాహానికి ఇంకా దూరంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం 54 ఏళ్ళ వయసులో ప్రేమ పెళ్లి కావాలి అంటుంది.. ఆమె ఎవరో కాదు లక్ష్మీ గోపాలస్వామి.. నటిగా కన్నా కూడా భరతనాట్య కళాకారిణి అని పిలిపించుకోవడమే తనకు అత్యంత ప్రీతికరం అంటుంది . నాట్యం ద్వారానే కళ్ళల్లో హావభావాలను అవలీలగా పలికించగల నైపుణ్యాన్ని ఒడిసి పట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా తన అభినయంతో మలయాళం, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా పేరు దక్కించుకుని .. సెకండ్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయింది.

ఇక తెలుగులో అరవింద సమేత వీర రాఘవ , సైరా నరసింహారెడ్డి సినిమాలలో మెరిసిన ఈమె.. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెరపై కూడా అలరిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె వయసు 54 సంవత్సరాలు.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. డాన్స్ , నటనల మధ్య పడి పెళ్లి విషయాన్నే మరిచిపోయిందని అప్పట్లో చాలామంది గుర్తు చేశారు కూడా.. అయితే దీనికి ఆమె స్పందిస్తూ.. నా అందం, సమాజంలో నా గౌరవం చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేవారు నాకు అవసరం లేదు… ఇవేవీ లేకపోయినా నన్ను నన్నుగా ఇష్టపడే వారిని నేను వివాహం చేసుకుంటాను.. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.. అయితే ఇప్పటివరకు అలాంటి లక్షణాలున్న అబ్బాయి అయితే దొరకలేదు అని తెలిపింది.

అలాంటి లక్షణాలున్న అబ్బాయి కోసం ఎదురుచూస్తూ ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి తప్ప పెళ్లి ఊసు మాత్రం ఎత్తలేదు. అయితే ఇప్పుడేమో పెళ్లీడు వయసు కూడా దాటిపోవడంతో వివాహం గురించి ఆలోచించడం లేదని చెబుతోంది లక్ష్మి. ఇకపోతే పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలను కనే వయసు కాదని.. దాని గురించి అడగద్దని కూడా చెబుతోంది . ఇక ఇది విన్న అభిమానులు సింగిల్ గానే ఉండిపోతారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇలా ఈమెలాగే వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉన్న హీరోయిన్లు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా చాలామందే ఉన్నారని చెప్పవచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు