Krishna – Vijay Nirmala: కృష్ణ – విజయ్ నిర్మల లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్ట్ లా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో కృష్ణ, ప్రముఖ హీరోయిన్ , నిర్మాత , దర్శకురాలు విజయనిర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం సాక్షి.. ప్రముఖ చిత్రకారులు బాపు దర్శకుడిగా వ్యవహరించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో వీరిద్దరూ జంటగా కలిసి నటించారు. ఆ తర్వాత రీల్ లైఫ్ లోనే మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరు ఆ తర్వాత రియల్ లైఫ్ లో కూడా దంపతులుగా మారారు. ఇకపోతే కృష్ణ , విజయనిర్మల 1969లో ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం .

ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తున్నప్పుడే ప్రేమించుకున్న వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉండగా విజయనిర్మల, కృష్ణ లవ్ స్టోరీ లో ఉన్న ట్విస్ట్ లు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే కృష్ణ తల్లిదండ్రులను విజయనిర్మల ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. మరొకవైపు కృష్ణ సోదరుడు కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవిని ఒప్పించే ప్రయత్నం చేశారట. అలా ఎన్నో ఇబ్బందుల మధ్య ఎంతోమంది సఖ్యత వల్లే వీరిద్దరి పెళ్లి జరిగిందని సమాచారం. వీరిద్దరి ప్రేమను కృష్ణ ఫ్యామిలీ అంగీకరించడానికి చాలా సమయమే పట్టిందట.

ఇక పెళ్లి తర్వాత కృష్ణ తల్లిదండ్రులు విజయనిర్మలతోనే ఉన్నారని.. పెళ్లయిన తర్వాత కూడా షూటింగ్ కి వెళ్లే ముందు కృష్ణ తల్లిదండ్రులకు వంట చేసి పెట్టి మరి విజయనిర్మల వెళ్లేదని సమాచారం. అంతేకాదు కృష్ణ తల్లిదండ్రులకు విజయనిర్మల చేతి వంట అంటే చాలా ఇష్టమట. ఇక కృష్ణ తల్లి మరణించే చివరి గంట ముందు కూడా విజయనిర్మల చేసిన బెండకాయ కూర, రసం తిన్నారని అదే చివరిసారి అయిందని గతంలో విజయనిర్మల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇకపోతే కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చిన తర్వాత విజయనిర్మల.. కృష్ణని పెట్టి సినిమా తీస్తానని చెప్పిందట. అప్పుడు కృష్ణ ఆర్టిస్ట్ గా 100 సినిమాలు పూర్తి చేయి ఆ తర్వాత సినిమాలకు దర్శకత్వం వహించు అని చెప్పారట.అలా కృష్ణ మాట మేరకు విజయ నిర్మల తెలుగు , తమిళ్, మలయాళం సినిమాలలో నటించి 80 సినిమాలను పూర్తి చేసింది. ఆ తర్వాత డైరెక్టర్ గా 45 చిత్రాలకు పనిచేసి గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించిం

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు