Kamal Hassan: మేము లేకున్నా మా మధ్య ప్రేమ మాత్రం స్థిరం – కమల్ హాసన్..!

Kamal Hassan: విశ్వ నటుడు కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా బిజీగా మారిపోయారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు హీరో గానే కాకుండా విలన్ గా కూడా అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఇకపోతే 19 ఏళ్ల వయసులో కమలహాసన్ మొదటి సారి నటి శ్రీవిద్యను కలిసారట. అప్పటికే ఆమె కొన్ని సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

కమలహాసన్ మాత్రం అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నటుడిగా ఎదుగుతున్నారు. మరి వీరి మధ్య ప్రేమ ఎలా మొదలైందో ఏమో తెలియదు కానీ మొదటి సినిమాతోనే కమలహాసన్ శ్రీవిద్య ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ ఆమె చనిపోయేంతవరకు కూడా కొనసాగిందంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలహాసన్ ఎమోషనల్ గా తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా కొన్ని ప్రేమకథలు పెళ్లితో అంతం కావు.. కానీ ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా తమ మనసులో ఒకరికి స్థానం అనేది ఎప్పుడు ఉంటుందని.. ఆ ఒక్కరు శ్రీవిద్య మాత్రమే అని కమలహాసన్ తెలిపారు. నిజానికి శ్రీవిద్య వేరే వ్యక్తిని వివాహం చేసుకొని.. జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. చివరికి క్యాన్సర్ తో పోరాడి తుది శ్వాస విడిచింది.

ఈమె మృత్యువు తో పోరాడుతున్న సమయంలో కమలహాసన్ తో చివరి క్షణాలలో గడపాలని తనతో చివరి శ్వాస వరకు ఉండాలని ఆమె కోరుకుందట. అయితే ఆ కోరిక నెరవేరకుండానే మరణించింది.. ఇక ఆ తర్వాత ఆమె ఆస్తుల విషయంలో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తన ఆస్తులు అన్నింటిని తన బంధువు సహాయంతో అనాధాశ్రమాలకు ఇచ్చినట్లు సమాచారం. సినిమాల ద్వారా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్న శ్రీవిద్య వైవాహిక జీవితంలో మాత్రం అంతకుమించి కష్టాలను అనుభవించింది. ఆస్తి కోసమే తనను ఆ వ్యక్తి వివాహం చేసుకున్నాడని.. అతని నిజ స్వరూపం తెలుసుకున్న ఈమె పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకొని ఒంటరిగా జీవితాన్ని కొనసాగించింది. ఇక చివరికి కాన్సర్ తో పోరాడి స్వర్గస్తురాలయింది. అలాంటి శ్రీవిద్య ప్రేమను కమలహాసన్ దక్కించుకోలేకపోయారు.. అయితే ఆ బాధ ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు